వెండితెరపై నిజ జీవిత కథలను, వాస్తవ సంఘటనల స్ఫూర్తితో రాసుకున్న కథలను ఆవిష్కరించడానికి ఈ మధ్య దర్శక - నిర్మాతలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. బయోపిక్స్, ఫిక్షనల్ బయోపిక్స్, రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకున్న సినిమాలు వస్తున్నాయి. జనవరి 26న తెలుగులో 'ఉనికి' అని ఓ సినిమా విడుదల కానుంది. దానికి స్ఫూర్తి ఓ మహిళా ఐఏఎస్ అని చెప్పాలి. ఆమె పేరు అనుపమ అంజలి. ప్రస్తుత గుంటూరు జిల్లా కలెక్టర్. గతంలో రాజమండ్రి సబ్ - కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ఆమెను చూసినప్పుడు కలిగిన ఆలోచనతో 'ఉనికి' స్క్రిప్ట్ తయారు చేశామని, అలాగని ఇది ఆమె రియల్ స్టోరీ కాదని నిర్మాతలు బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి తెలిపారు.
'నాటకం' ఫేమ్ ఆశిష్ గాంధీ... 'రంగుల రాట్నం', 'సిల్లీ ఫెలోస్', 'తెల్లవారితే గురువారం' సినిమాల్లో కథానాయికగా నటించిన చిత్రా శుక్లా కాంబినేషన్‌లో ఎవర్‌గ్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో రూపొందిన సినిమా 'ఉనికి'. రాజ్‌కుమార్ బాబీ దర్శకత్వం వహించారు. బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి నిర్మాతలు. అనుపమ అంజలి స్ఫూర్తితో రూపొందిన ఈ కథలో చిత్రా శుక్లా కలెక్టర్ రోల్ చేశారు. జనవరి 26న ఈ సినిమా విడుదల కానుంది.
నిర్మాతలు బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి మాట్లాడుతూ "డ్రామా థ్రిల్లర్ ఇది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యాయి. ఈ నెల చివరి వారంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి... జనవరి 26న థియేటర్లలో సినిమాను విడుదల చేస్తాం. సామాన్య మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఓ యువతి ఐఏఎస్ అవుతుంది. సమాజానికి మంచి చేయాలని అనుకుంటుంది. ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏమిటి? వాటిని ఎలా అధిగమించి తన 'ఉనికి'ని చాటుకున్నారు? అనేది కథ. ఆల్రెడీ విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది" అని చెప్పారు. టీఎన్ఆర్, 'రంగస్థలం' నాగ మహేష్, అప్పాజీ అంబరీష తదితరులు నటించిన ఈ చిత్రానికి పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడు, అడ్డాల రాజేష్ సహ నిర్మాత.
Also Read: నిర్మాతగా పవన్.... మేనల్లుడితోనా? అబ్బాయితోనా?
Also Read: లక్ష్మీ మంచుకు యాక్సిడెంట్... అసలు ఏమైందంటే?
Also Read: రాజమౌళి తర్వాత రవితేజతో... బాలకృష్ణ జోరు ఎక్కడా తగ్గట్లేదుగా!
Also Read: 'ఆర్ఆర్ఆర్'కు కరోనా అలా కలిసొచ్చింది. లేదంటేనా...
Also Read: పవన్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్.. కలెక్షన్స్ విషయంలో రచ్చ రచ్చ..
Also Read: ‘బిగ్’ లీక్.. విజేత ఎవరో తెలిసిపోయింది.. షన్ముఖ్‌కు శ్రీరామ్ షాక్.. సిరి, మానస్ ఔట్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి