‘బిగ్ బాస్’ సీజన్ 5 ఆదివారంతో ముగియనుంది. ఈ సందర్భంగా శనివారమే గ్రాండ్ ఫినాలే షూట్ జరిగినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి హీరో నాని, దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, జగపతి బాబు హాజరైనట్లు తెలిసింది. 2వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన నాని.. గ్రాండ్ ఫినాలేకు గెస్టుగా రావడం గమనార్హం. గత సీజన్‌కు ఏ మాత్రం తగ్గకుండా.. ‘గ్రాండ్ ఫినాలే’ ఏర్పాట్లు చేశారట. డ్యాన్సులు.. స్కిట్లతో స్టేజ్ దద్దరిల్లిపోయేలా ఫినాలే ఉన్నట్లు తెలిసింది. అంటే.. ఆదివారం బిగ్ బాస్ ప్రేక్షకులకు నాన్-స్టాప్ ఎంటర్‌టైన్మెంటే అన్నమాట.
ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం.. హౌస్ నుంచి ముందుగా సిరి బయటకు వెళ్లినట్లు తెలిసింది. ఆమె తర్వాతే మానస్ కూడా బయటకు వెళ్లినట్లు సమాచారం. అయితే.. వీరు బిగ్ బాస్ ఇచ్చే మనీ ఆఫర్‌ను స్వీకరించారో లేదా అనేది మాత్రం తెలియరాలేదు. హౌస్‌లో షన్ను, సన్నీ, శ్రీరామ్ మాత్రమే ఉండటంతో ఫినాలేలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. గతంలో ఇండియన్ ఐడల్‌లో విజేతగా నిలిచిన శ్రీరామచంద్ర మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. బిగ్ బాస్‌లో మంచి ఫన్ అందించి మార్కులు కొట్టేసిన సన్నీయే విజేతగా నిలిచినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారంటే..
1. VJ Sunny2. Shanmukh Jaswanth3. Sreerama Chandra4. Maanas 5. Siri Hanmanth
ఆఖరి రోజు మారిన సమీకరణాలు?: హౌస్‌లో ఉన్న సభ్యులు ఎవరికి వారే స్ట్రాంగ్. చెప్పాలంటే.. మానస్, సన్నీలకు మొదట్లో పెద్దగా అభిమానులు లేరు. దీంతో వారు ఎన్నివారాలు ఉంటారనేది కూడా డౌట్‌గా ఉండేది. యూట్యూబ్ వీడియోలతో ఫేమస్‌గా మారిన సిరి, షన్నులకు యూత్ ఫాలోయింగ్ ఉండటంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌గా ఇంట్లోకి అడుగుపెట్టారు. ఇక శ్రీరామ చంద్రకు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు తక్కువే. ఇండియన్ ఐడల్‌లో పాల్గొనడం వల్ల జాతీయస్థాయిలో అభిమానులు ఉన్నారు. అయితే, వారు కూడా అతడిని ఆదుకుంటారనే గ్యారంటీ మొదట్లో లేదు. వీరంతా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాతే అభిమానులను పొందారు.
షన్ను, సిరిలు మొదటి నుంచి కలిసే ఆడటం.. అభిమానులకు కూడా నచ్చట్లేదని తెలుస్తోంది. అయినా సరే.. వారిని ఫ్యాన్స్ ఏ రోజు నిరాశ పరచలేదు. సిరి టాస్కుల్లో ప్రాణం పెడుతూ.. గెలవడానికి కష్టపడేది. దీంతో ప్రేక్షకులు ఆమెకు ఓట్లు వేసేవారు. ఆఖరి రోజు వారంలో కాజల్.. శ్రీరామ్‌తో గొడవ పడి ఉండకపోతే.. తప్పకుండా టాప్-5లో ఉండేదని అంచనా. ఈ వారంలో అంతా సాఫీగా సాగుతుందనే సమయానికి.. బిగ్ బాస్ ఇంట్లో ఫన్ క్రియేట్ చేస్తున్న సన్నీతో సిరి గొడవ పెట్టుకుంది. ఆమెకు షన్ముఖ్ సపోర్ట్ చేశాడు. పైగా.. చివరి రోజు ఫేక్ ఎలిమినేషన్ ద్వారా సిరిని బయటకు పంపడం కూడా ఆ జంటకు మైనస్ అయ్యింది. వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ చాలామందికి సహన పరీక్ష పెట్టింది. అయినా షన్ను రెండో స్థానం వరకు వచ్చాడంటే గ్రేటే. ఏది ఏమైనా.. విన్నర్ ఎవరనేది కొన్ని నిమిషాల్లో తేలిపోతుంది.
Also Read: ‘బిగ్ బాస్’కే దిమ్మతిరిగేలా అతడికి ఓట్లు.. రన్నరే డౌట్! ఆఖరి రోజు మారిన సమీకరణాలు
Also Read: ‘షన్ను.. ఐ లవ్ యూ’.. మనసులో మాట చెప్పేసిన సిరి.. ముద్దులు హగ్గులతో సహన పరీక్ష!
Also Read: సిరి ఓట్లకు గండి కొట్టిన ‘బిగ్ బాస్’.. ఆమె ఎలిమినేషన్‌తో షన్ను ‘లెక్క’ మారుతుందా?
గమనిక: విశ్వసనీయం వర్గాలు, ఇతరాత్ర సోర్స్, ఓటింగ్ సరళి తదితర ఆధారాల ద్వారా ఈ కథనాన్ని అందించామని గమనించగలరు. కార్యక్రమంలో అంచనాలు, సమీకరణాలు తారుమరయ్యే అవకాశాలున్నాయి.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి