యాషెస్‌ సిరీసులో ఆస్ట్రేలియా మరో విజయం వైపు దూసుకుపోతోంది! తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌ భారీ స్కోరు చేయడమే ఇందుకు కారణం. అతడు 201 బంతుల్లో 12 బౌండరీలు, 1 సిక్సర్‌ సాయంతో 93 పరుగులు చేశాడు. ఇలా బ్యాటింగ్‌ చేసేందుకు అతడు అర్ధరాత్రి ఒంటిగంటకు బెడ్‌రూమ్‌లో ఏం చేశాడో అతడి సతీమణి డానీ విలిస్‌ వెల్లడించింది.






ఆస్ట్రేలియాకు గతంలో స్టీవ్‌స్మిత్‌ సారథ్యం వహించిన సంగతి తెలిసిందే. 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో బాల్‌ ట్యాంపరింగ్‌ చేయడంతో అతడిపై నిషేధం పడింది. ఆ తర్వాత తిరిగిచ్చినా కెప్టెన్సీ ఇవ్వలేదు. ఓ మహిళతో అనుచితంగా సంభాషించిన సందేశాలు బయటపడటంతో టిమ్‌పైన్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో సీనియర్‌ పేసర్ ప్యాట్‌ కమిన్స్‌కు పగ్గాలు అప్పగించారు. గాయంతో అతడూ వెనుదిరగడంతో స్మిత్‌కు తాత్కాలికంగా నాయకత్వం అప్పగించారు. ఈ ఉత్సాహంలో అతడు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. జట్టును ముందుకు నడిపిస్తున్నాడు.






స్టీవ్‌స్మిత్‌ ఇంతలా బ్యాటింగ్‌ చేయడానికి కారణం అతడు అర్ధరాత్రి పడక గదిలో షాడో బ్యాటింగ్‌ చేయడమే కారణమని తెలుస్తోంది. పక్కనే భార్య ఉన్నప్పటికీ అతడు కిట్‌ పట్టుకొని ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించాడు. ఇదే విషయాన్ని అతడి సతీమణి విలిస్‌ సోషల్‌ మీడియాలో బయటపెట్టింది. అతడు షాడో బ్యాటింగ్‌ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేసింది. అంతేకాకుండా గతంలోనూ 200 రోజుల తర్వాత డానీ విలిస్‌ను కలిసినా.. స్మిత్‌ఖ షాడో బ్యాటింగ్‌ చేస్తున్న వీడియోను పంచుకుంది. 'క్రిస్‌మస్‌ ముందురోజు పిల్లాడిలా కనిపిస్తున్నాడు' అంటూ కామెంట్‌ పెట్టింది. ఆ వీడియోలు ఇప్పడు వైరల్‌గా మారాయి.


Also Read: Kidambi Srikanth: తెలుగు తేజం మరో సంచలనం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన కిడాంబి శ్రీకాంత్


Also Read: Year Ender 2021: ఈ ఏడాదీ యువరాజ్‌ దొరకలేదు..! ప్రపంచకప్పులు అందలేదు!


Also Read: IND vs SA: గబ్బర్‌ను పక్కన పెడితే అన్యాయమే! మిస్టర్‌ ఐసీసీనే పక్కన పెట్టేస్తారా?


Also Read: IND vs SA, KL Rahul: టీమ్‌ఇండియా టెస్టు వైస్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌


Also Read: Watch: ఊ.. అంటావ్‌ మామా! ఈ జింక పిల్ల గోల్‌ చూస్తే అనక తప్పదు మామా!!


Also Read: IND Vs SA: కెప్టెన్సీ రచ్చ అంతా సోషల్‌ మీడియాలోనే..! మస్తు ఎంజాయ్‌ చేస్తున్న ద్రవిడ్‌, కోహ్లీ!