బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా ఎవరు నిలవనున్నారనే విషయంలో ఆసక్తి పెరిగిపోతుంది. ట్రోఫీ సన్నీకి వస్తుందని కొందరు.. కాదు, కాదు శ్రీరామ్ కే ఆ హక్కు ఉందని మరికొందరు వాదిస్తున్నారు. ఇంకొందరేమో షణ్ముఖ్ ని సపోర్ట్ చేస్తున్నారు. మరికాసేపట్లో ఈ విషయంలో క్లారిటీ రానుంది. శుక్రవారం వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ గా ఉండడంతో ప్రేక్షకులంతా తన అభిమాన కంటెస్టెంట్స్ కి వీలైనన్ని ఎక్కువ ఓట్లు వేశారు. సోషల్ మీడియాలో చేపట్టిన పోలింగ్ బట్టి చూస్తుంటే మాత్రం సన్నీ గెలుస్తాడని ప్రచారం జరుగుతోంది. కానీ ఇందులో ఎంతవరకు నిజముందో చెప్పలేం. మెజారిటీ ఆడియన్స్ మాత్రం సన్నీ విన్నర్ అని ఫిక్సయిపోయారు.


ఇదిలా ఉండగా.. తాజాగా గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. అందులో అలియాభట్, రణబీర్ కపూర్ జంటగా వచ్చారు. వాళ్లని చూసిన హౌస్ మేట్స్ బాగా ఎగ్జైట్ అయ్యారు. సన్నీ అయితే అలియా అంటూ గట్టిగా అరిచాడు. వెంటనే అలియా 'సన్నీ ఐ లవ్యూ' అని చెప్పింది. అది విన్న సన్నీ కిందపడిపోతూ కనిపించాడు. 


ఇదిలా ఉండగా.. ఫినాలే ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చిన నాని.. సన్నీకి పాతిక లక్షలు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అది కంటెస్టెంట్స్ కి ఇచ్చే డబ్బు కాదట. అభిమానంతో సన్నీకి పాతిక లక్షలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట నాని. గత సీజన్లలో కొందరు గెస్ట్ లు ఇలానే కంటెస్టెంట్స్ కి డబ్బులు ఇచ్చారు. మెహబూబ్, సోహెల్ లకు చిరంజీవి ఇలానే డబ్బులు ఇచ్చారు. కానీ పాతిక లక్షలు అనేది చాలా ఎక్కువ మొత్తమనే చెప్పాలి. నాని మాత్రం ఇంత మొత్తాన్ని అభిమానంతో సన్నీకి ఇస్తున్నట్లు తెలుస్తోంది.