కళకు, కళాకారులకు భేదం లేదు. మంచి సినిమా ఎవరు, ఎక్కడ తీసినా విజయం సాధిస్తుంది. ప్రతిభావంతులు ఎక్కడ అయినా రాణించగలరు. తెలుగులో 'అర్జున్ రెడ్డి' తీసిన సందీప్ రెడ్డి వంగా, ఆ తర్వాత అదే కథను హిందీలో 'కబీర్ సింగ్'గా తీసి హిట్ కొట్టారు. 'జెర్సీ'ను అదే పేరుతో షాహిద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్నారు తెలుగులో సినిమా తీసిన గౌతమ్ తిన్ననూరి. ఇప్పుడు భారతీయ సినిమా పరిశ్రమ తెలుగు చిత్రసీమ వైపు చూస్తోంది. తెలుగు కథలు, దర్శకులను తమ దగ్గరకు తీసుకు వెళుతున్నారు. అలాగే, హేమంబ‌ర్ జాస్తిని తీసుకు వెళ్లారు.


తెలుగులో విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న 'కేరాఫ్ కంచరపాలెం' సినిమాను హేమంబ‌ర్ జాస్తి తమిళంలో 'కేరాఫ్ కాదల్'గా రీమేక్ చేశారు. తమిళ సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది విడుదల అయిన టాప్ 20 సినిమాల లిస్టులో ఆ సినిమా చోటు దక్కించుకుంది. దర్శకుడిగా ఆయన ప్రతిభ గురించి రాశారు. హేమంబ‌ర్ జాస్తి తెలుగు దర్శకుడే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 'రాజకుమారుడు', 'ఒక్కడు' సహా పలు సినిమాలకు కో - డైరెక్ట‌ర్‌గా పని చేశారు. కె. రాఘవేంద్రరావు, మణిరత్నం, త్రివిక్రమ్, గుణశేఖర్ తదితరుల దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశారు.


హేమంబ‌ర్ జాస్తికి దర్శకుడిగా తెలుగు నుంచి పలు అవకాశాలు వచ్చినా... మంచి కథా బలమున్న సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాలని 'కేరాఫ్ కంచెరపాలెం' తమిళ్ను రీమేక్ 'కేరాఫ్ కాదల్'కు ఓకే చెప్పారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయనకు డైరెక్షన్ ఆఫర్స్ వస్తున్నాయి. త్వరలో ఆయా సినిమా వివరాలు వెల్లడించనున్నారు. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న 'యశోద'కు ఆయన క్రియేటివ్ డైరెక్ట‌ర్‌గా సేవ‌లు అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది.


Also Read: ఉనికి... మహిళా ఐఏఎస్ స్ఫూర్తితో తీసిన సినిమా!
Also Read: నిర్మాతగా పవన్.... మేనల్లుడితోనా? అబ్బాయితోనా?
Also Read: లక్ష్మీ మంచుకు యాక్సిడెంట్... అసలు ఏమైందంటే?
Also Read: రాజమౌళి తర్వాత రవితేజతో... బాలకృష్ణ జోరు ఎక్కడా తగ్గట్లేదుగా!
Also Read: 'ఆర్ఆర్ఆర్'కు కరోనా అలా కలిసొచ్చింది. లేదంటేనా...
Also Read: సన్నీకి 'ఐలవ్యూ' చెప్పిన అలియాభట్.. పాతిక లక్షలు ఆఫర్ చేసిన నాని..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి