భారతీయ స్టేట్ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేటు పెంచింది. బేస్ రేట్‌ను 0.10 శాతం లేదా 10 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సవరించిన రేటు ప్రకారం 2021, డిసెంబర్ 15 నుంచి వార్షికంగా 7.55 శాతం వడ్డీ ఇవ్వనున్నారు.
ఈ ఏడాది మొదట్లో ఎస్‌బీఐ బేస్ రేట్‌ను 0.5 శాతం మేర తగ్గించింది. దాంతో వడ్డీరేట్లు 7.45 శాతానికి దిగొచ్చాయి. ఈ నేపథ్యంలో భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) కనీస వడ్డీరేటును నిర్ణయించింది. కేంద్ర బ్యాంకు నిర్ణయించిన కనీస వడ్డీరేటు కన్నా తక్కువ వడ్డీరేటు అమలు చేసేందుకు బ్యాంకులకు వీల్లేదు.
రూ.2 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్ల పైనా ఎస్‌బీఐ వడ్డీరేటును పెంచింది. డిసెంబర్ 15 నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి. రూ.2 కోట్లకు దిగువన ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీరేట్లో మార్పు చేయలేదు.
- 7 రోజుల నుంచి 45 రోజులు - సాధారణ ప్రజలు: 2.90 శాతం; సీనియర్ సిటిజన్లకు 3.40 శాతం
- 46 రోజుల నుంచి 170 రోజులు - సాధారణ ప్రజలు: 3.90 శాతం; సీనియర్ సిటిజన్లకు 4.40 శాతం
- 180 రోజుల నుంచి 210 రోజులు - సాధారణ ప్రజలు: 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు 4.90 శాతం
- 211 రోజుల నుంచి ఏడాదికి - సాధారణ ప్రజలు: 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు 4.90 శాతం
- ఏడాది నుంచి రెండేళ్లకు - సాధారణ ప్రజలు: 5 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.50 శాతం
- రెండేళ్ల నుంచి మూడేళ్లకు - సాధారణ ప్రజలు: 5.10 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.60 శాతం
- మూడేళ్ల నుంచి ఐదేళ్లకు - సాధారణ ప్రజలు: 5.30 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.80 శాతం
- ఐదేళ్ల నుంచి పదేళ్లకు - సాధారణ ప్రజలు: 5.40 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.20 శాతం
Also Read: Salary Structure Change: శాశత్వంగా WFH చేస్తున్నారా..! అయితే HRA కట్.. పెరగనున్న పన్ను భారం!
Also Read: Global Spam Report 2021: ఇండియాలో పాపులర్ స్కామ్ ఏంటో తెలుసా? అకౌంట్లో మీ డబ్బు జాగ్రత్త!!
Also Read: Rakesh Jhunjhunwala: 10 నిమిషాల్లో రూ.318 కోట్లు నష్టపోయిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా!
Also Read: Life Insurance Plan Tips: ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలో తికమక పడుతున్నారా? ఈ 4 స్టెప్స్ చూడండి మరి!
Also Read: Koo App: మనసుకు నచ్చింది 'కూ'సేయండి.. దూసుకెళ్తున్న #KooKiyaKya క్యాంపెయిన్