రాజమౌళి... జక్కన్న అనండి, దర్శక ధీరుడు అనండి.... ఇప్పుడు ఈ పేరే ఓ బ్రాండ్. ఆ బ్రాండ్ ఓ బాలీవుడ్ సినిమాతో అసోసియేట్ అయ్యింది. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో ప్రజెంట్ చేస్తోంది. ర‌ణ్‌బీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్‌ జంటగా... అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రల్లో ప్రముఖ హిందీ దర్శక - నిర్మాత కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేసిన సినిమా 'బ్రహ్మాస్త్ర'. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రాజమౌళి సమర్పణలో ఈ సినిమా విడుదల కానుంది. గతంలో 'అందాల రాక్షసి' సినిమా నచ్చడంతో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించారు.







రాజమౌళి తీసిన 'బాహుబలి' సినిమాను హిందీలో కరణ్ జోహార్ విడుదల చేశారు. ఇప్పుడు కరణ్ నిర్మించిన సినిమాకు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో 'బ్రహ్మాస్త్ర' తెలుగు మోషన్ పోస్టర్ విడుదల చేశారు. అందులో రాజమౌళి సమర్పణలో దక్షిణాది భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ వచ్చి తనకు కథ వివరించడంతో పాటు, కొన్ని రషెష్ చూపించారని... సినిమా అంటే తనకు ఎంత పిచ్చి ఉందో, అంత పిచ్చి అయాన్ ముఖర్జీలో ఉందని రాజమౌళి అన్నారు. ర‌ణ్‌బీర్ క‌పూర్‌ నటనలో ఇంటెన్సిటీ ఉంటుందని, హిందీలో తనకు ఇష్టమైన హీరో ఎవరనే ప్రశ్న చాలా ఇంటర్వ్యూలలో ఎదురైతే ర‌ణ్‌బీర్ క‌పూర్‌ పేరు చెప్పానని ఆయన తెలిపారు.
Also Read: నువ్వెవరు?... ర‌ణ్‌బీర్ క‌పూర్‌ను ప్ర‌శ్నించిన ఆలియా!
నాగార్జున నటించిన సన్నివేశాలు రషెష్‌లో చూశానని, ఆయన పూనకం వచ్చినట్టు నటించారని రాజమౌళి అన్నారు. ఏడేళ్ల కష్టం 'బ్రహ్మాస్త్ర' అని కరణ్ జోహార్ చెప్పారు. తన పాత్ర నిడివి ఎంత అనేది పక్కన పెడితే... సినిమాలో దాని ప్రభావం ఎక్కువ ఉంటుందని నాగార్జున అన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9న 'బ్రహ్మాస్త్ర' విడుదల కానుంది. మోడ్రన్ లవ్ స్టోరీ, సోషియో ఫాంటసీ అంశాలతో రూపొందిన సినిమా ఇది. రాజమౌళి సమర్పణలో 'బ్రహ్మాస్త్ర' దక్షిణాది భాషల్లో విడుదల కానుండటం తమకు గర్వకారణమని ర‌ణ్‌బీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్‌ సహా కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ సంతోషం వ్యక్తం చేశారు.


Also Read: ర‌కుల్ కోసం స్పెష‌ల్ హెలికాఫ్ట‌ర్...
Also Read: 'పుష్ప' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?
Also Read: 'పుష్ప'లో ఆ రాజకీయ నాయకుడు ఎవరు?
Also Read: బన్నీ ఫ్యాన్స్ బీభత్సం.. పుష్ప థియేటర్లపై అల్లు అర్జున్ అభిమానుల రాళ్ల దాడులు
Also Read: 'అంతఃపురం'తో ఈ ఏడాదికి వీడ్కోలు చెప్పనున్న రాశీ ఖన్నా!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి