రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బిజీ బిజీ. ఓ సినిమా తర్వాత మరో సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఆమె నటించిన, నటిస్తున్న సినిమాలు అర డజనుకు పైగా ఉన్నాయి. అందులో రెండు సినిమాల షూటింగ్స్ శుక్రవారం జరిగాయి. ఒకటి... అజయ్ దేవగణ్ 'రన్ వే 34'. ఇంకొకటి... ఆమె కండోమ్ టెస్ట‌ర్‌గా నటిస్తున్న 'ఛత్రీవాలీ'. అజయ్ దేవగణ్ సినిమా షూటింగ్ ఈ రోజు ఉదయం ముంబై సిటీలో జరిగింది. మధ్యాహ్నం తర్వాత పుణెలో 'ఛత్రీవాలీ' షూటింగ్. రకుల్ కోసం ముంబై నుంచి పుణె వెళ్లడానికి ఓ సినిమా యూనిట్ స్పెషల్‌గా హెలికాఫ్టర్ అరేంజ్ చేసిందని సమాచారం. అందులో ఆమె ట్రావెల్ చేశారు. ఫ్లైట్ జర్నీ అంటే టైమ్ ఎక్కువ పడుతుంది. అదే ప్రయివేట్ ఛాపర్ అంటే త్వరగా ట్రావెల్ చేయవచ్చు. అదీ సంగతి!
Also Read: కండోమ్ టెస్ట‌ర్‌గా ర‌కుల్... కండోమ్‌తో ఆమె లుక్ చూశారా?
రకుల్ నటించిన నాలుగు హిందీ సినిమాలు 2022లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 'రన్ వే 34'తో పాటు 'ఎటాక్', 'డాక్టర్ జి', 'థాంక్ గాడ్' సినిమాలు వచ్చే ఏడాది విడుదల అవుతున్నాయి. 'రన్ వే 34'లో అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్, ఆకాంక్షా సింగ్ నటిస్తున్నారు. 'డాక్టర్ జి'లో ఆయుష్మాన్ ఖురానా సరసన ఆమె కథానాయిక. 'ఎటాక్'లో జాన్ అబ్రహం హీరో. రెండేళ్ల నుంచి ఈ సినిమాల షూటింగ్స్ చేస్తున్నానని, ఏ సినిమాకు ఆ సినిమా భిన్నంగా ఉంటుందని, అన్నీ విజయాలు సాధిస్తాయని ఆశిస్తున్నట్టు రకుల్ పేర్కొన్నారు.






Also Read: 'పుష్ప' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?
Also Read: 'పుష్ప'లో ఆ రాజకీయ నాయకుడు ఎవరు?
Also Read: బన్నీ ఫ్యాన్స్ బీభత్సం.. పుష్ప థియేటర్లపై అల్లు అర్జున్ అభిమానుల రాళ్ల దాడులు
Also Read: 'అంతఃపురం'తో ఈ ఏడాదికి వీడ్కోలు చెప్పనున్న రాశీ ఖన్నా!
Also Read: ‘ఆల్ ది బెస్ట్ నాన్న...’ డ్రాయింగ్‌తో తండ్రికి అల్లు అయాన్ విషెస్
Also Read: Pushpa Twitter Review: అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో... ఇరగదీశాడట!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి