కార్తీకదీపం డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్..
మోనిత బ్యాగ్ ఇంట్లోంచి పడేసిన సౌందర్య.. ఇంకోసారి ఈ గడప తొక్కాలని ప్రయత్నించకని హెచ్చరిస్తుంది. సింపిల్ గా థ్యాంక్యూ చెబుతుంది మోనిత. నేను బాధ్యత మరిచిపోయినా మీరు నానమ్మ హోదాలో నా కొడుకుని ఎవరు ఎత్తుకెళ్లారో వీడియో ఫుటేజ్ చూపించారంటుంది. కానీ నన్ను గడప తొక్కొద్దనడం సరికాదంటుంది. నా కొడుకు, మీ కొడుకుని వెతికి పట్టుకుని మళ్లీ కోడలి హోదాలో మళ్లీ ఈ ఇంట్లో అడుగుపెడతా అని చెప్పి అందరికి జాగ్రత్తలు చెప్పేసి వెళ్లిపోతుంది.
Also Read: గౌతమ్ కి క్లారిటీ ఇచ్చిన రిషి - ఈగో మాస్టర్ కి షాక్ ఇచ్చిన వసుధార.. గుప్పెండత మనసు డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్
తాడికొండలో శ్రీవల్లి-కోటేష్ తీసుకొచ్చిన బాబుకి నామకరణ మహోత్సవం జరుగుతుంటుంది. ఏం పేరు పెట్టాలని నిర్ణయించారని పంతులు అడగడంతో..ఆనంద్ చెబుతారు..ఇంతలో అక్కడకు ఎంట్రీ ఇచ్చిన రుద్రాణి..రంగరాజు పేరు పెట్టమని చెబుతుంది. నామకరణంతో పాటూ ఇప్పుడు వీడిని నేను దత్తత తీసుకుంటున్నా అని బాబుని లాక్కుంటుంది. ఇది అన్యాయం అని కోటేష్ ఏడవడంతో.. న్యాయం-అన్యాయం ఉండవు బలవంతులు చేసినదే న్యాయం అంటుంది రుద్రాణి. మీరు తప్పుచేస్తున్నారు బిడ్డని ఇవ్వండి అని దీప అడ్డుపడుతుంది. స్పందించిన రుద్రాణి మీకు-ఈ గొడవకు ఎలాంటి సంబంధం లేదు ఇప్పటికే చాలా ఎక్కువ చేశారు ఆపండి అని హెచ్చరిస్తుంది. మీకు డబ్బులిస్తానని సంతకం పెట్టాకదా అని కార్తీక్ క్వశ్చన్ చేయడంతో మీకు డబ్బులిస్తానని సంతకం పెట్టాకదా అంటాడు కార్తీక్. అయితే నీ కూతుర్ని తీసుకెళ్లాలా అనడంతో కార్తీక్ ఆగిపోతాడు. నువ్వు-నీ పిల్లలు-మీ ఆయన అన్యాయం అయిపోకుండా ఉండాలంటే నాకు అడ్డుపడొద్దని బెదిరిస్తుంది రుద్రాణి. తమ్ముడు అని పిల్లలు ఏడుస్తుంటే..రంగరాజు తమ్ముడు అనండని చెప్పి రుద్రాణి వెళ్లిపోతుంది.
Also Read: మోనితని ఇంట్లోంచి గెెంటేసిన సౌందర్య, రుద్రాణి దగ్గరకు చేరిన మోనిత బిడ్డ, కార్తీకదీపం డిసెంబరు 28 మంగళవారం ఎపిసోడ్
కట్ చేస్తే సౌందర్య ఇంట్లో సీన్ ఓపెన్ అయింది
ఆదిత్య ఇక్కడేం చేస్తున్నావ్ వంటగదిలోకి వెళ్లి మా ముగ్గురికీ మంచి కాఫీ కలిపి తీసుకురా అంటుంది సౌందర్య. ఈ మోనిత బిడ్డ విషయంలో మనకో క్లారిటీ వచ్చింది కాబట్టి చాలా రిలీఫ్ గా ఉంది అంటుంది సౌందర్య. మనమేదో ఎత్తుకొచ్చామని నోటికొచ్చినట్టు వాగిందని శ్రావ్య అంటుంది. రత్నసీత చాలా సహాయం చేసిందని అనుకుంటూ..ఇదే రత్నసీత ద్వారా అన్నయ్య జాడ కనిపెట్టొచ్చు కదా అనుకుంటారు. మోనిత మొహంలో బాబు పోయిన బాధ లేదని శ్రావ్య అంటే.. ఎందుకు ఉండదు మనముందు గాంభీర్యం నటిస్తుంది అంతే అంటాడు ఆనందరావు. మోనితపై కోపంతో బాబు గురించి అస్సలు ఆలోచించలేదనుకుంటారంతా.
Also Read: కార్తీక్-దీప ఉన్న ఊర్లోకి మోనిత పనిమనిషి ప్రియమణి ఎంట్రీ.. కథలో మరో మలుపు.. కార్తీక దీపం డిసెంబరు 27 సోమవారం ఎపిసోడ్..
దీప ఇంట్లో
ఎన్నో కాన్పులు పోతే దేవుడిచ్చిన కొడుకుని కూడా తీసుకెళ్లిపోవడం ఎంతవరకూ కరెక్ట్ అక్కా అని ఏడుస్తుంది శ్రీవల్లి. నా ఇల్లు లాక్కున్నా నేను బాధపడలేదని శ్రీవల్లి ఏడుస్తుంది. ఇల్లు వదిలేసుకుందాం బాబుని వదిలేయలేం కదా అని శ్రీవల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇద్దామంటుంది. కోటేష్ కంగారుపడి రుద్రాణిపై కంప్లైంట్ ఇస్తావా అంటే తల్లి పడే బాధేంటో మీ మగాళ్లకి తెలియదంటుంది శ్రీవల్లి. మనం కూడా సాయం చేద్దాం అంటుంది దీప..కానీ శ్రీవల్లి ఒప్పుకోదు. పోలీస్ స్టేషన్ కి వెళితే మన ఆచూకీ తెలిసిపోతుందని దీపతో అంటాడు కార్తీక్. శ్రీవల్లి వెళ్లడంతో కోటేష్ కూడా వెనకే వెళతాడు. పరిస్థితిని బట్టి మనం మసులుకోవాలి దీపా అంటాడు కార్తీక్. అదే సమయంలో..ఇందాక రుద్రాణి మీతో ఏదో మాట్లాడుతోందని అడుగుతుంది.. సమాధానం చెప్పని కార్తీక్ తలనొప్పిగా ఉంది కాఫీ కావాలని మాట దాటవేస్తాడు.
Also Read: ప్రజా వైద్యశాల ఓపెన్ చేద్దాం డాక్టర్ బాబు అన్న దీప.. బస్తీలో అదే పని చేసిన మోనిత, కార్తీకదీపం డిసెంబరు 25 శనివారం ఎపిసోడ్
వంటలక్క ప్రజా వైద్యశాల
ప్రజా వైద్యశాలలో కూర్చున్న మోనిత బాబుని వీడెవడో ఎందుకు ఎత్తుకెళ్లాడు.. ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లకి వీడియో పంపించాను ఏం జరుగుతుందో చూడాలి అనుకుంటుంది. నరసమ్మ ఖాళీగా ఉన్నాంకదా అని దోమలు కొట్టుకుంటున్నావా అంటుంది. మీరు అంత పెద్ద డాక్టర్ కదా సిటీలో ఆసుపత్రి పెట్టకుండా ఇక్కడ పెట్టారేంటని అడుగుతుంది. నరసమ్మ నువ్వు నన్ను క్వశ్చన్ చేయకు.. నేను అడిగితే సమాధానం చెప్పాలంతే అంటుంది. స్లమ్ లో వారంతా మన ఆసుపత్రికి రాకూడదని డిసైడ్ అయ్యారా అని నరసమ్మ అడుగుతుంది. చూస్తూ ఉండు వాళ్లే వస్తారు అంటుంది మోనిత. ఇంతలో కోటేష్ ఫొటో చూసి నువ్వు నాకు దొరకాలి నీ పని చెబుతా అనుకుంటుంది. మరోవైపు ఏంటి ఆలోచిస్తున్నారు సామీ అంటూ కార్తీక్ ను దీప అడుగుతుంది. మంచో-చెడో అయిపోయిన దారిగురించి ఆలోచిస్తే ఏమొస్తుంది అంటుంది. ఆ రోజు నేను రుద్రాణి మనుషుల్ని కొట్టకుండా ఉండాల్సింది అంటే.. నేను ఏకంగా రుద్రాణినే కొట్టా కదా అంటుంది దీప. ఎపిసోడ్ ముగిసింది
Also Read: కార్తీక్, దీపకు మరోసారి షాక్ ఇచ్చిన రుద్రాణి, మోనిత కొడుకుని వెతికే పనిలో పడిన సౌందర్య, కార్తీకదీపం డిసెంబరు 24 శుక్రవారం ఎపిసోడ్
రేపటి ఎపిసోడ్ లో
కార్తీక్ బాబు ఏం మాట్లాడుతున్నారు రుద్రాణి దగ్గరకు వెళతారా అని షాకవుతుంది దీప. రిస్క్ అయినా పర్వాలేదు నేను పోలీస్ స్టేషన్ కి వెళతా కోటేష్-శ్రీవల్లికి అండగా ఉండాలని డిసైడ్ అవుతాడు కార్తీక్. మరోవైపు కార్తీక్ ఫోన్ దొరికిన బిచ్చగాడిని సౌందర్య ఇంటికి తీసుకొస్తుంది రత్నసీత. ఊరు వదిలి వెళ్లిపోయేటప్పుడు ఫోన్ పడేసి బస్సెక్కి వెళ్లిపోవడం గురించి సౌందర్యకి చెబుతాడు బిచ్చగాడు.
Also Read: మనసుకి కళ్లెం వేయొద్దన్న మహేంద్ర.. వసుని ఇంట్లోంచి పంపించే ప్రాసెస్ మొదలెట్టిన జగతి.. గుప్పెడంత మనసు డిసెంబరు 25 శనివారం ఎపిసోడ్
Also Read: వసు విషయంలో రిషికి క్లారిటీ ఇచ్చిన జగతి.. గౌతమ్ ప్రేమకి అడ్డుతగులుతున్న ఈగో మాస్టర్, గుప్పెడంత మనసు డిసెంబరు 27 సోమవారం ఎపిసోడ్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి