సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రెండు సినిమాలు వచ్చాయి. తొలి సినిమా 'అతడు' కల్ట్ క్లాసిక్ అవ్వగా... రెండో సినిమా 'ఖలేజా' మ‌హేష్‌లో కామెడీ యాంగిల్‌ను కొత్త కోణంలో చూపించింది. ఈ రెండు సినిమాలు వచ్చి చాలా రోజులు అయ్యింది. సుమారు 11 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ మహేష్, త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తున్నారు. ఈ హ్యాట్రిక్ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ సంగతులు అన్నీ తెలిసినవే.


ప్రస్తుతం మహేష్ బాబు దుబాయ్‌లో ఉన్నారు కదా! ఆయన్ను కలవడం కోసం త్రివిక్రమ్ అండ్ టీమ్ అక్కడికి వెళ్లింది. త్రివిక్రమ్ వెంట నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్ ఉన్నారు. మహేష్ బాబుతో స్క్రిప్ట్ గురించి, ప్రొడక్షన్ గురించి డిస్కషన్స్ జరిగాయని తెలిసింది. "వర్క్ అండ్ చిల్... టీమ్‌తో ఈ రోజు మధ్యాహ్నం పని గురించి డిస్కస్ చేశాం" అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.
Also Read: సంక్రాంతి కూడా అక్కడే ప్లాన్ చేసిన మహేష్ బాబు...
ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నారు. మరో నెల షూటింగ్ చేస్తే సినిమా పూర్తి అవుతుంది. మోకాలికి సర్జరీ జరగడంతో ఆయన దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఫిబ్రవరిలో మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. 'సర్కారు వారి పాట' పూర్తి అయిన తర్వాత త్రివిక్రమ్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సినిమా ప్రారంభించాలని భావిస్తున్నారట. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

Continues below advertisement






Also Read: మ‌హేష్‌ బాబుకు ఇష్టమైన కో-డైరెక్టర్... దర్శకుడిగా కోలీవుడ్‌లో స‌త్తా చాటాడోయ్!
Also Read: భీమ్లా నాయక్... పవన్ కల్యాణ్ కోసం త్రివిక్రమ్ స్పెషల్ క్లైమాక్స్!
Also Read: నా చేతుల్లో ఏమీ లేదు... ఫ్యాన్స్‌కు క్ష‌మాప‌ణ‌లు - 'భీమ్లా నాయక్' నిర్మాత
Also Read: ఏపీలో టికెట్ రేట్స్ ఎఫెక్ట్... ఇండియాలో భారీ స్క్రీన్ మూసివేత
Also Read: అర్ధరాత్రి ఆ హీరో ఇంటి దగ్గర కెమెరా కంటికి చిక్కిన హీరోయిన్
Also Read: వందల వేల లక్షల కోట్లు ఎలా వస్తున్నాయ్? రాజకీయ అవినీతిని టార్గెట్ చేసిన 'గాడ్సే'
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి