Bheemla Nayak: నా చేతుల్లో ఏమీ లేదు... ఫ్యాన్స్‌కు క్ష‌మాప‌ణ‌లు - 'భీమ్లా నాయక్' నిర్మాత

పవన్ కల్యాణ్ అభిమానులకు 'భీమ్లా నాయక్' నిర్మాత సూర్యదేవర నాగవంశీ సారీ చెప్పారు. పవన్ కల్యాణ్ చెప్పడం వల్లే సినిమాను వాయిదా వేయాల్సి వచ్చిందని అన్నారు. 

Continues below advertisement

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన 'భీమ్లా నాయక్' సంక్రాంతి బరి నుంచి తప్పుకొంది. విడుదల వాయిదా పడింది. ఇప్పుడు సినిమా జనవరిలో విడుదల కావడం లేదు. ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే... 'భీమ్లా నాయక్' సంక్రాంతి బరి నుంచి తప్పుకొంటుందనేది ఇప్పటి వార్త కాదు, ఎప్పటిదో! సినిమా విడుదల వాయిదా పడిందని వార్తలు వచ్చిన ప్రతిసారీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఖండించారు. ఇప్పుడు వాయిదా పడటంతో పవన్ అభిమానులకు ఆయన సారీ చెప్పారు.
"అభిమానులు అందరిని క్షమాపణలు కోరుతున్నాను. సారీ! పరిస్థితి నా చేతుల్లో లేదు. మా హీరో పవన్ కల్యాణ్ గారు చెప్పినట్టు నడుచుకోవాల్సి వచ్చింది. ఆయన ఎప్పుడూ పరిశ్రమ బాగు కోసమే ఆలోచిస్తారని, ఇండస్ట్రీ సంక్షేమం వైపు మొగ్గు చూపుతారనేది మీకు తెలిసిందే. మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను... శివరాత్రికి థియేటర్లను తుఫాను తాకుతుంది" అని సూర్యదేవర నాగవంశీ ట్వీట్ చేశారు.

Continues below advertisement


పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానాకు జోడీగా సంయుక్తా మీనన్ నటించిన 'భీమ్లా నాయక్' మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియమ్'కు రీమేక్. అయితే... తెలుగు ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టు కథలో మార్పులు చేశారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణల అందించడంతో పాటు ఓ పాట కూడా రాశారు. సినిమాకు సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు.
Also Read: బాలయ్య దగ్గరకు అల్లు అర్జున్ వస్తున్నాడు... రవితేజ వెనక్కి వెళ్లాడు!
Also Read: పవన్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. సంక్రాంతి రేసు నుంచి 'భీమ్లానాయక్' ఔట్..
Also Read: 'పుష్ప' సినిమా రేటింగ్స్.. విమర్శలపై 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ కామెంట్స్..
Also Read: సెక్సీగా కనిపించడం కోసం ఎంత కష్టపడ్డానో.. 'పుష్ప' ఐటెం సాంగ్ పై సామ్ రియాక్షన్..
Also Read: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు స‌డ‌న్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన రాధే శ్యామ్ టీమ్‌... రెబల్ స్టార్ లుక్ రిలీజ్!
Also Read: అప్పుడు అనుష్కతో... ఇప్పుడు సమంతతో
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement