ఓ సినిమాలో బ్రహ్మానందం పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను అనేకరకాలుగా ప్రశ్నలు వేస్తూ.. ఉంటాడు నీకు ‘నెల్లూరు పెద్దారెడ్డి తెలీదా’ అంటూ తెగ బిల్డప్ ఇస్తూ ఉంటాడు.. ఆ సీన్ ఎవర్ గ్రీన్. ఆ సన్నివేశంలో బ్రహ్మానందం పండించిన కామెడీకి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌ను చాలా మీమ్స్‌లో వాడతారు. ఎన్నో సందర్భాల్లో ఆ సీన్‌ను వాడుకుంటూ మీమర్స్ ట్రోల్స్ కూడా చేస్తుంటారు. అలాంటి ఓ ఫన్నీ సంఘటన నిజ జీవితంలో జరిగితే..! నిజంగానే కాస్త ఆ సన్నివేశానికి తగినట్లుగానే ఈ ఘటన జరిగింది. నిన్న (డిసెంబరు 20) జగిత్యాలలో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
జగిత్యాలలో నటరాజ్ థియేటర్ వద్ద పెట్రోలింగ్ చేస్తున్న కానిస్టేబుళ్లకు ఓ యువకుడు బైక్ అదుపు తప్పి పడిపోవడం కనిపించింది. అతణ్ని కాపాడడానికి వెళ్లి లేవనెత్తిన పోలీస్ కానిస్టేబుల్‌లను ఆ వ్యక్తి మీరెవరు అంటూ ప్రశ్నించాడు. పోలీసులు అసలు ఎటు వెళ్తున్నావ్...? ఎందుకు వెళ్తున్నావ్? అంటూ అతన్ని తిరిగి ప్రశ్నించారు. సమాధానాలు చెప్పకుండా బాధితుడు కాస్త ఓవరాక్షన్ చేశాడు. ముందు మీరెవరో చెప్పండి.. మీ ఐడీ కార్డులు చూపించాలంటూ తిరిగి ప్రశ్నలు వేశాడు ఆ మందు బాబు. అర్ధరాత్రి ఈ మందుబాబు గోలలో ఉన్న కానిస్టేబుళ్లకు అటుగా వెళుతున్న ఎస్ఐ నవత పెట్రోలింగ్ వాహనం కనిపించింది.
ఆ వాహనాన్ని ఆపి అందులో ఉన్న ఎస్సై నవతకి జరిగిన విషయం తెలిపారు. ఆమె.. సరే మీ ఐడీ కార్డులు చూపించండి సార్‌కు అంటూ కానిస్టేబుళ్లకు సూచించారు. దాంతోపాటు ఆ మందు బాబుకి బ్రీత్ టెస్ట్ కూడా చేయాలంటూ ఆదేశించారు. టెస్ట్ చేయగానే రీడింగ్ ఏకంగా 160 వచ్చింది. దీంతో అతని బండిని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. కౌన్సిలింగ్‌తో బాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు. తాగిన మైకంలో ఓవరాక్షన్ చేసి చివరికి మందుబాబు కటకటాలపాలయ్యాడు.
Also Read: Nellore Crime: ఇంటి నుంచి బయటికెళ్లిన కొడుకు.. వచ్చి చూస్తే షాక్.. అసలేం జరిగిందంటే..?
Also Read: TSRTC: తెలంగాణ ఆర్టీసీ గ్రేట్ ఆఫర్.. వంద టికెట్‌పై రూ.20 డిస్కౌంట్, వీరికి మాత్రమే..