తల్లీ కొడుకులిద్దరే ఆ రూమ్ లో ఉంటారు. కొడుకు బయటికి వెళ్లాడు. ఇంటికొచ్చి చూసే సరికి తల్లి మంచంపై కదలలేని స్థితిలో పడిపోయి ఉంది. వంటిపై బట్టలు చిందరవందరగా ఉన్నాయి. మొహం, మెడపై గాట్లు ఉన్నాయి. ఆ సీన్ చూసి ఒక్కసారిగా కొడుకు గట్టిగా కేకలు పెట్టాడు. ఆ అరుపులకు చుట్టు పక్కలవారు వచ్చారు. తల్లి హత్యకు గురైందనే అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి డాగ్ స్క్వాడ్ తో చుట్టుపక్కల ఆనవాళ్లు గమనించారు.


Also Read: TSRTC: తెలంగాణ ఆర్టీసీ గ్రేట్ ఆఫర్.. వంద టికెట్‌పై రూ.20 డిస్కౌంట్, వీరికి మాత్రమే..


అనుమానితులపై సమాచారం..
తన తల్లి ఎవరి జోలికి వెళ్లదని, ఎవరితో ఆమెకు గొడవలు లేవని, బంధువులు కూడా తక్కువగా తమ ఇంటికి వస్తుంటారని చెబుతున్నాడు మృతురాలి కొడుకు సాయితేజ. అయితే తమ ఇంటికి దగ్గరలో ఉన్న కొంత మందిపై అతను అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. వారిపై పోలీసులకు సమాచారం ఇచ్చానని, పోలీసులు విచారణ చేపట్టారని చెబుతున్నాడు.


లక్ష్మీశెట్టి లక్ష్మి (39) మృతిని హత్య కేసు కింద రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు వేదాయపాళెం సీఐ నరసింహారావు. మృతురాలి కొడుకు ఇచ్చిన సమాచారం మేరకు కొందరు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Also Read: KTR On PM Modi: అప్పుడు ప్రత్యక్ష నరకం చూపించి.. ఎన్నికల వేళ కూలీలతో భోజనం.. ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ సెటైర్!


అసలేం జరిగింది..?
లక్ష్మీ శెట్టి లక్ష్మి అనే మహిళ.. కొడుకుతో కలసి నెల్లూరులోని చంద్రమౌళి నగర్‌లో నివాసం ఉండేది. ఆమె వంట మాస్టర్‌గా పనిచేసేది. కొడుకు కూడా ఆమె సంపాదనపైనే ఆధారపడేవాడు. ఈ క్రమంలో ఇటీవలే తల్లి ఓ హోటల్ నుంచి మరో హోటల్ లో పనికి మారిందని చెబుతున్నాడు కొడుకు సాయితేజ. పోలీసులకైతే అనుమానితుల పేర్లు చెప్పాడు కానీ, వారి వివరాలు బయటపెట్టలేదు. అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.


Also Read: Drugs in Gujarat: గుజరాత్‌లో మరోసారి మత్తు భూతం.. పాక్ బోటులో రూ.400 కోట్ల డ్రగ్స్ సీజ్


Also Read: East Godavari: షూ పాలిష్ పేరుతో నకిలీ టీ పౌడర్ తయారీ... భారీగా జీడి పిక్కల తుక్కు పట్టివేత...


Also Read: వైఎస్ఆర్‌సీపీ నేతల క్షమాపణలు మాకు అక్కర్లేదు.. మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలని నారా భువనేశ్వరి సలహా !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి