Balakrishna & Allu Arjun: బాలయ్య దగ్గరకు అల్లు అర్జున్ వస్తున్నాడు... రవితేజ వెనక్కి వెళ్లాడు!

అవును... బాలకృష్ణ దగ్గరకు అల్లు అర్జున్ వస్తున్నాడు. దాంతో రవితేజను వెనక్కి వెళ్లాడు. అసలు మేటర్ ఏంటి? అంటే... మీరు న్యూస్ చదవాల్సిందే!

Continues below advertisement

నట సింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో 'అన్‌స్టాప‌బుల్‌'. హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ ఆహాలో వస్తుంది. ఆల్రెడీ ఐదు ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి. ఆరో ఎపిసోడ్ డిసెంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని, దానికి మాస్ మహారాజ్ రవితేజతో పాటు దర్శకుడు గోపీచంద్ మలినేని అతిథులుగా వచ్చారని రెండు రోజుల క్రితం తెలిపారు. అయితే... ఇప్పుడు ప్లాన్ మారింది. ఆరో ఎపిసోడ్‌లో రవితేజ రావడం లేదు. అల్లు అర్జున్ వస్తున్నాడు.

Continues below advertisement

అవును... బాలకృష్ణ 'అన్‌స్టాప‌బుల్‌' టాక్ షోకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నాడు. అందుకని, రవితేజ వెనక్కి వెళ్లాడు. కాదు కాదు... అల్లు అర్జున్ కోసం రవితేజను వెనక్కి పంపించారు. అల్లు అర్జున్ సహా 'పుష్ప' సినిమా టీమ్ సందడి చేయనున్న ఎపిసోడ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల స్ట్రీమింగ్ కానుంది. అదీ సంగతి! త్వరలో ఈ ఎపిసోడ్ షూట్ చేయనున్నారు. 'పుష్ప' సినిమాను ప్రమోట్ చేయడానికి వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని అల్లు అర్జున్ అండ్ టీమ్ మిస్ చేసుకోవాలని అనుకోవడం లేదు. బాలయ్య షోకు బన్నీతో పాటు రష్మిక, సుకుమార్ వచ్చే అవకాశం ఉంది. రవితేజ, గోపీచంద్ మలినేని ఎపిసోడ్ డిసెంబర్ 31న స్ట్రీమింగ్ కానుంది.

Also Read: పవన్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. 'భీమ్లానాయక్' సంక్రాంతి రేసు నుంచి ఔట్..
Also Read: టైమ్ ట్రావెల్... జర్నలిజం... నాగచైతన్య స్క్రిప్ట్ కోసం పెద్ద స్కెచ్
Also Read: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు స‌డ‌న్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన రాధే శ్యామ్ టీమ్‌... రెబల్ స్టార్ లుక్ రిలీజ్!
Also Read: అప్పుడు అనుష్కతో... ఇప్పుడు సమంతతో
Also Read: ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క్రిష్ మీటింగ్‌... 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' గురించి కొత్త అప్‌డేట్‌!
Also Read: మణిరత్నం సినిమా వల్ల నాని సినిమాకు ఆ ఇద్దరూ దొరకలేదు!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola