దర్శకుడు విక్రమ్ కె. కుమార్ రూటే సపరేటు! ఆయన తీసిన సినిమాలు చూస్తే... ఆ విషయం అర్థం అవుతుంది. '13 బి', 'ఇష్క్', 'మనం', '24', 'హలో', 'నాని గ్యాంగ్ లీడర్'... డిఫరెంట్ జానర్ సినిమాలు తీశారు. ఇప్పుడు నాగ చైతన్య డిజిటల్ ఎంట్రీ కోసం డిఫరెంట్ స్క్రిప్ట్ ప్లాన్ చేసినట్టు తెలిసింది. అక్కినేని కుటుంబంలో మూడు తరాల హీరోలు ఏయన్నార్, నాగార్జున, నాగ చైతన్యతో విక్రమ్ కె. కుమార్ 'మనం' తీశారు. అందులో అఖిల్ అతిథి పాత్రలో కనిపించారు. తర్వాత అఖిల్ హీరోగా 'హలో' తీశారు. ఇప్పుడు నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న 'థాంక్యూ'కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగా... వాళ్లిద్దరూ మరో వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు.
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కలిసి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. డిసెంబర్ చివరి వారంలో సెట్స్ మీదకు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో నాగ చైతన్య జర్నలిస్ట్ రోల్ చేస్తున్నారని తెలిసింది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో విక్రమ్ కె. కుమార్ స్క్రిప్ట్ రెడీ చేశారట. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉండే విధంగా... 24 నుంచి 30 ఎపిసోడ్స్ తీసేలా పెద్ద స్కెచ్ వేశారట. నాగ చైతన్యకు జోడిగా ఈ వెబ్ సిరీస్‌లో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించనున్నారు.
ఈ వెబ్ సిరీస్, 'థాంక్యూ' సినిమా కాకుండా తండ్రి నాగార్జునతో కలిసి 'బంగార్రాజు' సినిమాలో నాగ చైతన్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ 'భీమ్లా నాయక్' విడుదల వాయిదా పడితే... ఆ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని ఫిలిం నగర్ టాక్.
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన రాధే శ్యామ్ టీమ్... రెబల్ స్టార్ లుక్ రిలీజ్!
Also Read: అప్పుడు అనుష్కతో... ఇప్పుడు సమంతతో
Also Read: పవన్ కల్యాణ్‌తో క్రిష్ మీటింగ్... 'హరి హర వీరమల్లు' గురించి కొత్త అప్‌డేట్!
Also Read: మణిరత్నం సినిమా వల్ల నాని సినిమాకు ఆ ఇద్దరూ దొరకలేదు!
Also Read: మరో మెగా హీరోతో... సంపత్ నందికి సినిమా చేసే ఛాన్స్ వచ్చిందా?
Also Read: సేవ చేస్తున్నందుకు లక్షల కోట్లు ఎలా వస్తున్నాయ్? రాజకీయ అవినీతిని టార్గెట్ చేసిన 'గాడ్సే'
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి