హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఆయన ఇంటి వద్దే రేవంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రైతు రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన ఇంటి నుంచి బయటకు రాగానే భారీ బందోబస్తు నడుమ పోలీసులు అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇందుకోసం నిన్న రాత్రి నుంచే రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ క్రమంలో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఉద్రిక్తతల్లో తెలంగాణ పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవిని పోలీసులు తోసేశారు. దీంతో ఆయన కింద పడడడంతో మల్లు రవికి స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసుల దురుసు ప్రవర్తనతో ఆయన చొక్కా కూడా చిరిగిపోయింది. మల్లు రవిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి, తరలిస్తున్న క్రమంలో పోలీసు వాహనాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. వారి నిరసనల మధ్యే రేవంత్ రెడ్డిని బలవంతంగా పోలీసు వాహనం ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. మరోవైపు నిర్బంధాలు ఎన్ని ఉన్నా సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లికి వెళ్తానని.. అక్కడ రచ్చబండ నిర్వహించి తీరతానని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
Also Read: రేవంత్ హౌస్ అరెస్టు.. అన్ని దారులు మూసేసిన పోలీసులు.. ‘కేసీఆర్‌కి ఎందుకీ భయం’ అంటూ ట్వీట్
రచ్చబండ కోసం
గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి కేసీఆర్ ఫామ్ హౌస్‌లో 150 ఎకరాలలో వరి పంటలు వేసిన అంశాన్ని మీడియాకు చూపిస్తానని రేవంత్ రెడ్డి ఇంతకుముందే ప్రకటించారు. దీంతో ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో అర్ధరాత్రి నుంచే రేవంత్ రెడ్డి ఇంటి ముందు పోలీసుల పహారా కాశారు. రచ్చబండకు వెళ్లేందుకు రేవంత్ ఇంటి నుంచి బయటికి రాగానే పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన బాలయ్య.. ఆ పని అద్భుతమని ప్రశంసలు
Also Read: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే ఇక అక్కడ కూడా మీ పరువు పోయినట్టే..! పోలీసుల కొత్త ఐడియా