వంద (100) అడుగుల వెడల్పు... యాభై నాలుగు (54) అడుగుల ఎత్తు... సుమారు 650 మంది సీటింగ్ కెపాసిటీ... ఇదీ 'వి ఎపిక్' ప్రత్యేకత. ఇండియాలో, ఆ మాటకు వస్తే సౌత్ ఆసియాలోనే బిగ్గెస్ట్ స్క్రీన్ ఇది. ప్రపంచంలో చూసుకుంటే... మూడో భారీ స్క్రీన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో ఉంది. రూ. 40 కోట్లతో దీనిని నిర్మించారని సమాచారం. నెల్లూరు జిల్లావాసులు మాత్రమే కాదు, చెన్నైకి దగ్గరలో ఉండటంతో అతి ఇటు ప్రయాణాలు చేసే ప్రజలు సైతం ఆ థియేటర్లో సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తారు. 'సాహో' సినిమా ఈ థియేటర్‌లో షోలు మొదలయ్యాయి. దీనికి రామ్ చరణ్ ప్రారంభించారు. ఇకపై, ఇప్పట్లో 'వి ఎపిక్'లో ప్రజలు సినిమా చూడలేరు ఏమో! ఎందుకంటే... ఏపీలో టికెట్ రేట్స్ ప్రభావంతో ఆ థియేటర్ మూతపడింది.


అవును... 'వి ఎపిక్' మూత పడింది. ఇండియాలో, సౌత్ ఆసియాలో భారీ స్క్రీన్ అయినప్పటికీ... కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి థియేటర్ నిర్మించినప్పటికీ... గ్రామ పంచాయతీలో థియేటర్ ఉంది. దాంతో ఏపీ ప్రభుత్వం చెప్పిన రేట్లకు టికెట్లు అమ్మాల్సిన పరిస్థితి. గ్రామ పంచాయతీ పరిధిలో రూ 5, 10, 15 రూపాయల రేట్లను ప్రభుత్వం ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రేట్లకు టికెట్లు అమ్మడం కంటే థియేటర్ మూసి వేయడం వల్ల వచ్చే నష్టాలు తక్కువ అని యాజమాన్యం భావించింది. దాంతో తెరపై సినిమాలు ప్రదర్శించడం మానేసి, మూసేసింది.







ఆల్రెడీ తూర్పు గోదావరి జిల్లాలోని సుమారు 60 థియేటర్లు మూతపడ్డాయి. ఏపీ మొత్తంగా చూసుకునే వందకు పైగా థియేటర్లకు తాళాలు పడినట్టు సమాచారం. ప్రస్తుతం ఏపీలో సినిమా హాళ్లను నడపాలా? వద్దా? అనే సందిగ్ధంలో చాలా థియేటర్ యాజమాన్యాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాల ఖబర్.


Also Read: స్టార్ కమెడియన్ కి ఒమిక్రాన్‌..? హాస్పిటల్ లో ట్రీట్మెంట్..
Also Read: హీరోయిన్ తో ఆమిర్ ఖాన్ సీక్రెట్ మ్యారేజ్.. అసలు నిజమిదే..
Also Read: టికెట్ రేట్స్... కెసిఆర్‌కు థాంక్స్ చెప్పిన చిరంజీవి!
Also Read: మనసుకి కళ్లెం వేయొద్దన్న మహేంద్ర.. వసుని ఇంట్లోంచి పంపించే ప్రాసెస్ మొదలెట్టిన జగతి.. గుప్పెడంత మనసు డిసెంబరు 25 శనివారం ఎపిసోడ్
Also Read: ప్రజా వైద్యశాల ఓపెన్ చేద్దాం డాక్టర్ బాబు అన్న దీప.. బస్తీలో అదే పని చేసిన మోనిత, కార్తీకదీపం డిసెంబరు 25 శనివారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి