తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కెసిఆర్)కు ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి థాంక్స్ చెప్పారు. తెలంగాణలో సినిమా టికెట్ రేట్స్ పెంచుకునే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గతంతో పోలిస్తే... ఇప్పుడు ఖర్చులు విపరీతంగా పెరిగాయని, సినిమా బడ్జెట్లు పెడుతున్నాయని, టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి ఇవ్వవలసిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని తెలుగు సినిమా పరిశ్రమ కోరింది. అందుకు సానుకూలంగా స్పందించి... టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. అందుకు, చిరంజీవి థాంక్స్ చెప్పారు.
Also Read: టాలీవుడ్‌పై తెలంగాణ సర్కార్ చల్లని చూపు... టిక్కెట్ రేట్లు పెంచుతూ ఉత్తర్వులు !
"తెలుగు సినిమా పరిశ్రమ కోరికను మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యాజమాన్యాలకు... అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ KCR గారికి కృతఙ్ఞతలు. సినిమా థియేటర్ల  మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది" అని చిరంజీవి ట్వీట్ చేశారు.





ఏపీ ప్రభుత్వాన్ని కూడా సినీ పరిశ్రమ రిక్వెస్ట్ చేసింది. అయితే... అక్కడ రేట్స్ పెంచకపోగా, తగ్గించారు. సామాన్యులకు వినోదం అందుబాటులోకి తీసుకు వస్తున్నామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంచుకోమని చెప్పడంతో... రెండు ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాన్ని పరిశ్రమలో ప్రముఖులు చర్చించుకుంటున్నారు. 


Also Read: పవన్ కల్యాణ్ వెనుక వరుణ్ తేజ్... 'గని' రిలీజ్ డేట్ ఫిక్స్!
Also Read: తొడ కొట్టిన బాలయ్య... తగ్గేదే లే!
Also Read: భీమ్లా నాయక్... పవన్ కల్యాణ్ కోసం త్రివిక్రమ్ స్పెషల్ క్లైమాక్స్!
Also Read: '83' మూవీ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?
Also Read: తల్లిదండ్రులకు ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టిస్తున్న 'చమ్మక్' చంద్ర...
Also Read: 'శ్యామ్ సింగ రాయ్' రివ్యూ: తిరగబడిన సంగ్రామమా? ఎగసిపడిన అలజడా?
Also Read: 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు' రివ్యూ: సినిమా ఎలా ఉంది?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి