'భీమ్లా నాయక్'... పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మ్యాచో స్టార్ రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న సినిమా. మలయాళ సినిమా 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కు రీమేక్ ఇది. పేరుకు రీమేక్ అయినప్పటికీ... తెలుగుకు వచ్చేసరికి చాలా మార్పులు, చేర్పులు చేశారని ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తే ఎవరికైనా ఈజీగా అర్థం అవుతుంది. మళయాళంతో పోలిస్తే... తెలుగులో పాటలు పెరిగాయి. నిడివి తగ్గించినట్టు తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్‌ ఏంటంటే... సినిమా హైలైట్స్‌లో క్లైమాక్స్‌ ఒకటి అవుతుందట.


'భీమ్లా నాయక్'కు సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించారు. పవన్ కల్యాణ్ ఇమేజ్‌కి తగ్గట్టు... రానాను కూడా దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ స్పెషల్ క్లైమాక్స్ డిజైన్ చేశారట. మ‌ల‌యాళంలో క్లైమాక్స్‌ను మార్చి తీసిన‌ట్టు ఫిలిం నగర్ టాక్.- ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఎడిటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. క్లైమాక్స్ చూస్తే... ఆడియ‌న్స్‌కు గూస్ బంప్స్‌ రావడం ఖాయం అని యూనిట్ సభ్యులు అంటున్నారట.


పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా దగ్గుబాటి సరసన సంయుక్తా మీనన్ నటిస్తున్న 'భీమ్లా నాయక్'ను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. తొలుత సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయాలని అనుకున్నా... 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్' నిర్మాతలు వాయిదా వేసుకోమని 'భీమ్లా నాయక్' నిర్మాత, హీరోలను రిక్వెస్ట్ చేయడంతో ఫిబ్రవరి 25కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.






Also Read: '83' మూవీ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?
Also Read: తల్లిదండ్రులకు ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టిస్తున్న 'చమ్మక్' చంద్ర...
Also Read: 'శ్యామ్ సింగ రాయ్' రివ్యూ: తిరగబడిన సంగ్రామమా? ఎగసిపడిన అలజడా?
Also Read: ఇక తెలుగులో 24 గంటల బిగ్‌బాస్.. నాన్‌స్టాప్ బాదుడే!
Also Read: 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు' రివ్యూ: సినిమా ఎలా ఉంది?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి