బిగ్ బాస్.. తెలుగునాట ఈ పేరు ఎంతో సుపరిచితం. ఇష్టపడే వారు కావచ్చు, ఇష్టపడని వారు కావచ్చు. ఈ షో ఒక్కసారి ప్రారంభం అయితే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతుంది. ఇటీవలే బిగ్ బాస్ సీజన్-5 కూడా ముగిసిన సంగతి తెలిసిందే. వివాదాలు, హగ్గులు, ముద్దులతో నిండిపోయిన ఈ సీజన్‌లో వీజే సన్నీ విన్నర్‌గా నిలవగా.. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ రన్నరప్‌గా నిలిచాడు.
అయితే బిగ్ బాస్ లవర్స్‌కు గుడ్ న్యూస్ ఏంటంటే.. ఇదే షో కొత్త ఫార్మాట్లో ప్రేక్షకులను పలకరించనుంది. అదే బిగ్ బాస్ ఓటీటీ. ఈ షో త్వరలోనే ప్రారంభం కానుందని హోస్ట్ నాగార్జున అధికారికంగా ప్రకటించారు. 24 గంటలూ షోను స్ట్రీమ్ చేయవచ్చని కూడా పేర్కొన్నారు. అయితే షో ఫార్మాట్ ఏంటి? ఎంత మంది కంటెస్టెంట్‌లు ఉంటారు? ఎన్ని రోజులు జరగనుంది? వంటి విషయాలు మాత్రం ఇంకా సస్పెన్స్‌గా ఉంచారు. కానీ కార్యక్రమం ఫార్మాట్ మారనుందని మాత్రం తెలిపారు.
ఇటీవలే బిగ్ బాస్ హిందీ ఓటీటీ వెర్షన్ స్ట్రీమ్ అయి పెద్ద సక్సెస్ అయింది. స్టే కనెక్టెడ్ అనే ఫార్మాట్‌లో జరిగిన హిందీ బిగ్ బాస్ ఓటీటీలో ఆరుగురు యువతులు, ఆరుగురు యువకులు జంటగా హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. ఒక యువతి ఒంటరిగా హౌస్‌లోకి వెళ్లింది. అంటే మొత్తం 13 మంది కంటెస్టెంట్లు అన్నమాట. 42 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ షోలో టాప్-5లో నిలిచిన వారిని నేరుగా బిగ్ బాస్ సీజన్ 15లోకి తీసుకున్నారు.
తెలుగులో కూడా ఇదే ఫార్మాట్ ఫాలో అవుతారా? లేదా? అన్న విషయం మాత్రం తెలియరాలేదు. యువతీ యువకులను ముందే జంటగా లోపలికి పంపిస్తే మాత్రం వివాదాలు రావడం ఖాయం. అయితే ఈ విషయాలపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read: 'అర్జున ఫల్గుణ' ట్రైలర్ టాక్.. మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో శ్రీవిష్ణు..
Also Read:2 మిలియన్ క్లబ్ లో 'పుష్ప'.. బన్నీ క్రేజ్ అలాంటిది..
Also Read:హృతిక్ రోషన్ తో సమంత.. క్రేజీ ప్రాజెక్ట్ సెట్ కానుందా..?
Also Read:రైతులకు చిరు సెల్యూట్.. ప్రజలను మొక్కలు నాటమంటూ రిక్వెస్ట్..