Arjuna Phalguna: 'అర్జున ఫల్గుణ' ట్రైలర్ టాక్.. మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో శ్రీవిష్ణు..

శ్రీవిష్ణు నటిస్తోన్న 'అర్జున ఫల్గుణ' సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. 

Continues below advertisement

వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు నటుడు శ్రీవిష్ణు. ఇప్పుడు ఆయన మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే 'అర్జున ఫల్గుణ'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం థ్రిల్లింగ్, ఫన్ ఎలిమెంట్స్ తో సాగింది. పల్లెటూర్లో ఇంటింటికి తిరుగుతూ పాలు అమ్ముకునే కుర్రాడు సడెన్ గా క్రైమ్ లోకి దిగుతాడు. 

Continues below advertisement

హీరోని అతడి స్నేహితులను వెతుకుతూ పోలీసులు తిరుగుతారు. 'అరకెళ్లి నా పేరు చెప్తే నీకో మూటిత్తాడు' అంటూ హీరో చెప్పే డైలాగ్ ని బట్టి ఇది గంజాయి మాఫియా బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమా అని అర్ధమవుతోంది. పోలీస్ ఆఫీసర్ గా నటుడు సుబ్బరాజ్ కనిపించారు. ట్రైలర్ లో హీరోయిన్ తో లవ్ స్టోరీని కూడా చూపించారు. 

ఫైనల్ గా హీరో ఓ మూట పట్టుకొని పోలీసులకు, రౌడీలకు దొరక్కుండా పారిపోతూ కనిపించాడు. అసలు ఆ మూటలో ఏముందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఎదురుచూడాల్సిందే. 'చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుంది' అనే లైన్ తో ఈ సినిమాను దర్శకుడు తేజ మార్ని తెరకెక్కిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read:2 మిలియన్ క్లబ్ లో 'పుష్ప'.. బన్నీ క్రేజ్ అలాంటిది..

Also Read:హృతిక్ రోషన్ తో సమంత.. క్రేజీ ప్రాజెక్ట్ సెట్ కానుందా..?

Also Read:రైతులకు చిరు సెల్యూట్.. ప్రజలను మొక్కలు నాటమంటూ రిక్వెస్ట్..

 
 
 
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Continues below advertisement
Sponsored Links by Taboola