సెలబ్రిటీల మీద సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం, సెటైర్లు వేయడం చాలా మందికి అలవాటుగా మారింది. కొంత మంది విమర్శలకు బదులు ఇస్తారు. కొందరు ఇవ్వరు. అప్పుడప్పుడూ తనపై వచ్చిన విమర్శల పట్ల అనసూయ భరద్వాజ్ స్పందిస్తుంటారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అనసూయ బాగా లావు అయ్యిందని థంబ్‌నైల్స్‌ పెట్టి కథనాలు ప్రసారం చేశారు. వాళ్లకు అనసూయ సైలెంట్‌గా క్లాస్ పీకారు. వాళ్లను 'మీ క్యారెక్టర్ సంగతేంటి?' అని సూటిగా ప్రశ్నించారు.


"నేను కొన్ని యూట్యూబ్ ఛానళ్లు చూశా. ఎంత లావయిపోయింది చూడండి. ఓవర్ వెయిట్, షాకింగ్ ఇలాంటి థంబ్‌నైల్స్‌ పెట్టారు. నేను బరువు పెరుగుతా... తగ్గుతా... మీ క్యారెక్టర్, దిగజారినతనాన్ని ఎలా చెబుతారు? మీ సంగతేంటి?" అని అనసూయ భరద్వాజ్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పేర్కొన్నారు. యూట్యూబ్ చాన్నాళ్లకు చాలా మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు  ఉన్నప్పుడు... రెస్పాన్సిబిలిటీతో వ్యవహరించాలని, థంబ్‌నైల్స్‌ పెట్టేటప్పుడు ఆలోచించాలని ఆమె హితవు పలికారు.


"ఇటువంటి విమర్శలను పట్టించుకోవద్దు అంటారు. కానీ, మనం ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండ‌ము క‌దా! ప్రతిసారీ ధైర్యంగా ఉండం. వీక్ మూమెంట్స్ ఉంటాయి. కొన్ని కామెంట్స్ చూసినప్పుడు బాధపడతాం. అటెన్షన్ కోసం కొంతమంది కామెంట్ చేస్తారేమో? కానీ, యూట్యూబ్ చాన్నాళ్లకు చాలా మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు  ఉన్నప్పుడు... రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా! థంబ్‌నైల్స్‌ పెట్టేటప్పుడు ఆలోచించాలి కదా!" అని అనసూయ అన్నారు. అనుకుంటే ఆ థంబ్‌నైల్స్‌ పెట్టేవాళ్లను బాధపెట్టేలా తాను మాట్లాడగలనని, అయితే ఇతరులను బాధ పెట్టడం తన నిజం కాదని, బాధ పెట్టకూడదని అనుకుంటున్నాని ఆమె సెలవిచ్చారు. అదీ సంగతి!


ఇటీవల విడుదల అయిన 'పుష్ప'లో తన లుక్ గురించి కూడా అనసూయ మాట్లాడారు. కొంత మంది విగ్ సెట్ అవ్వలేదని చెప్పారని, ప్రేక్షకుల అందరి అనుమతి ఉంటే 'పుష్ప 2'లో తన లుక్ మారుతుందని చెప్పుకొచ్చారు.


Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్
Also Read: శ్రీరామ చంద్ర కాళ్లు చూస్తే కన్నీళ్లు ఆగవు... ఎంత పని చేశావ్ 'బిగ్ బాస్'!
Also Read: కొమురం భీముడో... కొమురం భీముడో... ఎన్టీఆర్ సాంగ్ ప్రోమో వచ్చింది! చూశారా?
Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!
Also Read: సంక్రాంతి కూడా అక్కడే ప్లాన్ చేసిన మహేష్ బాబు...
Also Read: 'ఢీ' నుంచి దర్శకేంద్రుడి దగ్గరకు... దీపికా పిల్లి గ్రాఫ్ ఓ రేంజ్‌లో ఉంది మ‌రి!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి