దీపికా పిల్లి... 'ఢీ 13' సీజన్ ముందు వరకూ టీవీ ఆడియన్స్‌లో ఆమె గురించి తెలిసిన ప్రేక్షకులు తక్కువ. అప్పటికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పాపులర్ ఫేస్. ఇన్‌స్టాలో ఆమె ఫాలోయింగ్, హుషారు చూసి 'ఢీ 13: కింగ్స్ వర్సెస్ క్వీన్స్'కు రష్మీ గౌతమ్‌తో పాటు మరో ఫీమేల్ టీమ్ లీడర్‌గా సెలెక్ట్ చేశారు. మధ్య 'జబర్దస్త్'లో ఒక స్కిట్ చేశారు. తన అందంతో, అభినయంతో, చలాకీతనంతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దగ్గరకు వెళ్లారు. ఆయనతో సినిమా చేసే అవకాశం అందుకున్నారు. దాంతో దీపికా పిల్లిని అదృష్టం వరించిందని టీవీ ఇండస్ట్రీలో జనాలు అంటున్నారు. ఒక్క షో తర్వాత రాఘవేంద్రుడితో సినిమా చేసే అవకాశం అందుకోవడం మామూలు విషయం కాదంటున్నారు.
"ఇప్పుడే ఓ అద్భుతమైన స్క్రిప్ట్ విన్నాను... అదీ లెజెండ్ రాఘవేంద్ర రావు గారి నుంచి! నేను చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. త్వరలో మేజర్ అప్‌డేట్ ఇస్తా" అని రాఘవేంద్రరావుతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు దీపికా పిల్లి. రాఘవేంద్రరావు తదుపరి సినిమాలో ఆమె కథానాయికగా నటిస్తున్నారా? లేదంటే ఆమెకు కీలక పాత్ర దక్కిందా? అనేది త్వరలో తెలుస్తుంది.
'ఢీ 13: కింగ్స్ వర్సెస్ క్వీన్స్' తర్వాత సీజన్ 'ఢీ 14: ద డాన్సింగ్ ఐకాన్'లో దీపికా పిల్లిని టీమ్ లీడర్‌గా కంటిన్యూ చేయలేదు. అయితే... సినిమాల్లో అవకాశాలు వస్తుండటంతో ఆమె ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు ఉన్నారు.
Also Read: 'భీమ్లా నాయక్' బ్యూటీకి మరో క్రేజీ సినిమాలో ఛాన్స్!
Also Read: 'కనీసం నీకు నువ్వైనా సమాధానం చెప్పుకో'.. దీప్తి స్టేటస్ షణ్ముఖ్ ని ఉద్దేశించేనా..?
Also Read: 'విక్రమార్కుడు' సినిమాకి సీక్వెల్.. కానీ మేటర్ ఏంటంటే..?
Also Read: హీరోయిన్ అవ్వాలనుకుంటున్నారా? ఈ నొప్పిని భరించాల్సిందే.. రష్మిక స్వీట్ వార్నింగ్
Also Read: నాది అంత కంఫర్టబుల్ కాదు... ఒరిజినల్ స్ట్రగుల్స్ వేరే ఉన్నాయ్! - నాని ఇంటర్వ్యూ
Also Read: 'ఆర్ఆర్ఆర్' ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్ట్ లుగా చిరంజీవి, బాలకృష్ణ..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి