సంయుక్తా మీనన్... 'భీమ్లా నాయక్'తో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయం అవుతున్నారు. సినిమాలో రానా దగ్గుబాటికి జోడీగా కనిపించనున్నారు. తెలుగులో ఆమెకు ఇది తొలి సినిమా. కానీ, కథానాయికగా కాదు. మలయాళంలో ఓ పది సినిమాల వరకూ చేశారు. దుల్కర్ సల్మాన్, టోవినో థామస్ వంటి మలయాళ స్టార్ హీరోల సరసన నటించారు. తమిళంలో మూడు చేశారు. అయితే... 'భీమ్లా నాయక్' ఆమెకు తొలి భారీ సినిమా. దీని తర్వాత సంయుక్తా మీన‌న్‌కు మరో భారీ సినిమాలో నటించే అవకాశం వచ్చినట్టు టాలీవుడ్ టాక్.


'భీమ్లా నాయక్' సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఇదే సంస్థ ధనుష్ కథానాయకుడిగా ఓ తెలుగు, తమిళ సినిమా నిర్మిస్తోంది. అందులో కథానాయికగా సంయుక్తా మీనన్‌ను ఎంపిక చేసినట్టు టాక్. 'భీమ్లా నాయక్'లో ఆమె నటన చూసి... ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చారట. ధనుష్ సరసన సంయుక్తా మీనన్ ఇప్పటివరకు నటించలేదు. ఈ సినిమా ఓకే అయితే తమిళంలో ఆమె ఇదే తొలి భారీ సినిమా అవుతుంది.
Also Read: ABP Desam Exclusive: ధనుష్ తొలి తెలుగు సినిమా టైటిల్ ఇదే...
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్యా శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు 'సర్' (SIR) టైటిల్ ఖరారు చేశారు. ధ‌నుష్‌కు తొలి తెలుగు సినిమా ఇది. తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాను రూపొందించనున్నారు. 'రంగ్ దే' తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది.






Also Read: 'కనీసం నీకు నువ్వైనా సమాధానం చెప్పుకో'.. దీప్తి స్టేటస్ షణ్ముఖ్ ని ఉద్దేశించేనా..?
Also Read: 'విక్రమార్కుడు' సినిమాకి సీక్వెల్.. కానీ మేటర్ ఏంటంటే..?
Also Read: హీరోయిన్ అవ్వాలనుకుంటున్నారా? ఈ నొప్పిని భరించాల్సిందే.. రష్మిక స్వీట్ వార్నింగ్
Also Read: నాది అంత కంఫర్టబుల్ కాదు... ఒరిజినల్ స్ట్రగుల్స్ వేరే ఉన్నాయ్! - నాని ఇంటర్వ్యూ
Also Read: 'ఆర్ఆర్ఆర్' ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్ట్ లుగా చిరంజీవి, బాలకృష్ణ..?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి