హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో పాక్ పై భారత్ గెలిచింది. మూడో స్థానం కోసం జరిగిన ఈ పోరులో భారత్.. పాకిస్థాన్ ను 4-3 తేడాతో ఓడించింది. కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా మన్‌ప్రీత్ సింగ్ నిలిచాడు. భారత ఆటగాళ్లు హర్మన్‌ప్రీత్, అక్షదీప్‌సింగ్, వరుణ్ కుమార్, గుర్‌సాహిబిజిత్ సింగ్‌లు గోల్ చేశారు.
భారత్ తరఫున వైస్‌కెప్టెన్ హర్మన్ ప్రీత్‌సింగ్.. ఒకటో నిమిషంలో.., సుమిత్ 45వ నిమిషంలో.., వరుణ్ కుమార్53వ నిమిషంలో, ఆకాశ్‌దీప్ సింగ్ 57వ నిమిషంలో ఒక్కో గోల్ చేశారు. అయితే పాకిస్థాన్ జట్టుకు.. అఫ్రజ్, అబ్దుల్ రానా, అహ్మద్ నదీమ్ ఒక్కో గోల్ అందించారు. మెుదటి నుంచి భారత ఆటగాళ్లు.. దూకుడుగా ఆడారు. నాలుగు పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చాయి. అయినా.. ఒకదానినే గోల్‌గా మలిచారు.
ఫస్ట్ క్వార్టర్ ముగిసే వరకు భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. పాకిస్థాన్ సైతం వెంటనే పుంజుకుని.. పదకొండో నిమిషంలో గోల్ చేసి స్కోరును 1-1 ఈక్వెల్ చేశారు. మూడో క్వార్టర్ ప్రారంభంలోనే.. 33వ నిమిషం వద్ద.. పాక్ ఆటగాడు అబ్దుల్ గోల్ కొట్టాడు. దీంతో.. 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది పాకిస్థాన్. 45వ నిమిషంలో భారత ఆటగాడు.. సుమిత్ గోల్ చేయగా.. మళ్లీ స్కోర్ 2-2 గా ఈక్వెల్ అయింది. 53వ నిమిషంలో వరుణ్ కుమార్, 57వ నిమిషం వద్ద ఆకాశ్ దీప్ తో భారత్ కు గోల్స్ వచ్చాయి. ఇక భారత్ 4-2తో ముందుకు వెళ్లింది. చివరిలో పాక్ గోల్ వేయడంతో.. స్కోర్ 4-3గా నమోదైంది. దీంతో భారత్ కాంస్యం గెలుచుకుంది.
అయితే లీగ్ దశ మ్యాచ్‌ల్లో ఓటమి తెలియని భారత జట్టు కీలక సెమీఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆసియా ఛాంపియన్స్ హాకీ టోర్నమెంట్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. ఆ మ్యాచ్ లో అంచనాలను నిలబెట్టుకోలేకపోయింది. జపాన్ చేతిలో 5-3 తేడాతో ఓటమి పాలైంది. ఫైనల్ చేరకుండానే భారత్ పోరు ముగిసింది. మూడో స్థానం కోసం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో గెలిచింది.
Also Read: IPL Auction 2022: ఐపీఎల్ వేలం తేదీలు వచ్చేశాయి..! ఫిబ్రవరిలోనే.. బెంగళూరులో
Also Read: India vs South Africa: హైదరాబాదీ సిరాజ్‌పై సచిన్ ప్రశంసలు.. ఎందుకంటే?