టీమ్‌ఇండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్‌పై దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ ప్రశంసల జల్లు కురిపించారు. అతడి బౌలింగ్‌లో ఏదో కొత్తదనం కనిపిస్తుందని పేర్కొన్నారు. కెప్టెన్ ఎప్పుడు అడిగినా ఉత్సాహంగా బౌలింగ్ చేస్తాడని వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో అతడు కీలక బౌలర్‌గా అవతరించే అవకాశం ఉందన్నారు. 'బ్యాక్‌స్టేజ్ విత్ బొరియా' కార్యక్రమంలో సచిన్ మాట్లాడారు.
'సిరాజ్ రనప్ ఎంతో బాగుంటుంది. అతడు ఉత్సాహంగా కనిపిస్తాడు. మైదానంలో చూసినప్పుడు అతడు వేసిది తొలి ఓవరో, చివరి ఓవరో గుర్తించలేరు. ఎందుకంటే అడిగిన ప్రతిసారీ అతడు బౌలింగ్‌కు వస్తాడు. ఇది నాకెంతో నచ్చుతుంది. అతడి బాడీ లాంగ్వేజ్ పాజిటివ్‌గా ఉంటుంది. గతేడాది ఆస్ట్రేలియాలోనూ ఇదే కనిపించింది. అతడు వేగంగా నేర్చుకుంటాడు. అరంగేట్రం మ్యాచులో అతడు తొలిసారి ఆడుతున్నట్టే అనిపించలేదు. ఎంతో పరిణతి కనిపించింది. తన స్పెల్‌ను ఎంతో అందంగా నిర్మించుకున్నాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ప్రతిసారి కొత్త వ్యూహాలు అమలు చేశాడు' అని సచిన్ వివరించారు.
సచిన్ స్పందనకు సిరాజ్ ఆనందం వ్యక్తం చేశాడు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేశాడు. 'థాంక్యూ సచిన్ సర్. మీ నుంచి ఇలాంటి మాటలు రావడం నాకెంతో స్ఫూర్తిదాయకం. నా దేశం కోసం ఎప్పుడూ అత్యుత్తమంగా ఆడేందుకే ప్రయత్నిస్తాను. స్టే వెల్ సర్' అని సిరాజ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం అతడు దక్షిణాఫ్రికాలో ఉన్న సంగతి తెలిసిందే. సఫారీలతో మూడు టెస్టుల సిరీసు కోసం సిరాజ్ కఠోరంగా సాధన చేస్తున్నాడు. తొలి టెస్టులో అతడికి చోటు దొరికే అవకాశం ఉంది.
Also Read: IND vs SA: టెస్టు సిరీసు ముందు సఫారీలకు షాక్..! ఆ భయంకర పేసర్ సిరీసు నుంచి ఔట్!
Also Read: South Africa vs India: కోచ్ ద్రవిడ్ రికార్డుకే ఎసరు పెట్టిన కెప్టెన్ కోహ్లీ
Also Read: BWF Rankings: రెండేళ్ల తర్వాత టాప్-10లోకి కిదాంబి శ్రీకాంత్.. లక్ష్యకు కెరీర్ బెస్ట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి