టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీకి రికార్డులు బద్దలు కొట్టడం అలవాటే! విచిత్రంగా ఈ సారి కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ రికార్డుకే ఎసరు పెట్టాడు. దక్షిణాఫ్రికాలో అత్యధిక పరుగుల రికార్డు సాధించాలన్న తపనతో ఉన్నాడు. డిసెంబర్‌ 26 నుంచి మొదలయ్యే సిరీసు కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు.


దక్షిణాఫ్రికాలో రాహుల్‌ ద్రవిడ్‌ 22 ఇన్నింగ్సుల్లో 624 పరుగులు చేశాడు. సగటు 29.71. ఒక సెంచరీ, రెండు అర్ధశతకాలు సాధించాడు. టీమ్‌ఇండియా వాల్‌ టెస్టు కెరీర్లో ఇదే అత్యంత తక్కువ సగటు కావడం గమనార్హం. మరోవైపు కోహ్లీ సఫారీల గడ్డపై 10 ఇన్నింగ్సుల్లోనే రెండు సెంచరీలు, రెండు అర్ధశతకాలు, 55.80 సగటుతో 558 పరుగులు చేశాడు. అంటే ద్రవిడ్‌ను అధిగమించాలంటే కేవలం 66 పరుగులు చేస్తే చాలు.


ద్రవిడ్‌ రికార్డును బద్దలు కొడితే దక్షిణాఫ్రికాలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో విరాట్‌ కోహ్లీ రెండో స్థానానికి చేరుకుంటాడు. ఇప్పుడు మూడో స్థానంలో ఉన్న వీవీఎస్‌ లక్ష్మణ్‌ (18 ఇన్నింగ్సుల్లో 556)ను దాటేస్తాడు. అగ్రస్థానంలో ఉన్న సచిన్‌ తెందూల్కర్‌ను దాటేయాలంటే మాత్రం విరాట్‌ కష్టపడాల్సిందే. సఫారీ గడ్డపై సచిన్‌ 15 టెస్టుల్లోనే 46.44 సగటుతో 1161 పరుగులు చేశాడు. ఐదు సెంచరీలు, మూడు అర్ధశతకాలు ఖాతాలో ఉన్నాయి.


మొత్తంగా ఈ రెండు జట్ల మధ్య ద్రవిడ్‌ స్కోరును కోహ్లీ అధిగమించాలంటే కేవలం 177 పరుగులు చేస్తే చాలు. మిస్టర్‌ వాల్‌ 33.83 సగటుతో 1252 పరుగులు చేయగా కోహ్లీ 12 టెస్టుల్లో 59.72 సగటుతో 1075 పరుగులు చేశాడు. ఇక సచిన్‌ 25 టెస్టుల్లో 1741, సెహ్వాగ్‌ 15 టెస్టుల్లో 1306 పరుగులతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.


Also Read: Watch Video: పడక గదిలో భార్య పక్కనుంటే.. అర్ధరాత్రి స్టీవ్‌ స్మిత్‌ ఏం చేస్తున్నాడో చూడండి!


Also Read: India U19 WC Sqaud 2022: ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ భారత జట్టు వైస్‌ కెప్టెన్‌గా తెలుగు కుర్రాడు.. త్వరలో విండీస్‌కు పయనం


Also Read: BWF World Championships Finals: 'కిర్రాక్‌' కిదాంబి అనేలోపే..! ప్రపంచ ఛాంప్‌కు పాయింట్‌ దూరంలో ఆగిన శ్రీకాంత్‌!


Also Read: IND vs SA, 1st Test: భారత్- సౌతాఫ్రికా తొలి టెస్ట్‌లో గ్యాలరీలు ఖాళీ.. ఒమిక్రాన్ భయంతోనే!


Also Read: Rafael Nadal Covid Positive: టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ కు కరోనా... ట్వీట్ చేసిన రఫా...


Also Read: Ashwin on Ravi Shastri: శాస్త్రి మాటలు విన్నాక.. 'బస్సు కింద పడేసి తొక్కేసినట్టు' అనిపించిందన్న అశ్విన్‌!