టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ కరోనా బారిన పడ్డాడు. ముబాడాలా ప్రపంచ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌ నుంచి గాయం కారణంగా నిష్ర్కమించి స్పెయిన్ చేరుకున్న కొద్ది రోజులకే రాఫెల్ నాదల్ కు కోవిడ్ -19 పాజిటివ్ వచ్చింది. 20 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన రాఫెల్ నాదల్.. కరోనా సోకిన విషయాన్ని స్వయంగా ప్రకటించాడు. త్వరలోనే కరోనా నుంచి కోలుకుని గ్రౌండ్ అడుగుపెడతానని, భవిష్యత్ టోర్నమెంట్‌లపై తన ప్రణాళికలను తెలియజేస్తానని ట్వీట్ చేశాడు.  






"నేను అబుదాబి టోర్నమెంట్ నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నిర్వహించిన పీసీఆర్ పరీక్షలో కోవిడ్ పాజిటివ్ అని తెలిపింది" అని నాదల్ ట్వీట్ చేశాడు. 35 ఏళ్ల రాఫెల్ కు కువైట్, అబుదాబిలో కరోనా పరీక్షలు నిర్వహించారు కానీ అప్పుడు నెటిగివ్ వచ్చింది. ఆగస్టులో వాషింగ్టన్ లో జరిగిన సిటీ ఓపెన్ తర్వాత.. ఇటీవలె రాఫెల్ మ్యాచ్ ఆడాడు. అబుదాబి ఎగ్జిబిషన్ ఈవెంట్‌ మ్యాచ్ లో గాయపడ్డ రాఫెల్ స్పెయిన్ కు తిరిగి వచ్చాడు. 


Also Read: ఊ.. అంటావ్‌ మామా! ఈ జింక పిల్ల గోల్‌ చూస్తే అనక తప్పదు మామా!!


ఆస్ట్రేలియా ఓపెన్ లో ఆటడంపై సందిగ్ధత


గత కొద్దికాలంగా గాయంతో మేజర్ టోర్నీలను వదులుకున్న ఈ స్పానిష్ స్టార్ ఆటగాడు.. ఇటీవలె ఓ ఎగ్జిబిషన్ టోర్నీలో ఆడేందుకు అబుదాబి వెళ్లాడు. అతి త్వరలోనే తాను పూర్తిగా కోలుకుని తిరిగి టెన్నిస్ కోర్టులో అడుగుపెడతానని నాదల్ ట్వీట్ చేశాడు. అంతేగాక తన భవిష్యత్ టోర్నీలు, తాను పాల్గొనబోయే పోటీల గురించి త్వరలోనే తెలియజేస్తానన్నాడు. 20 సార్లు గ్రాండ్ స్లామ్ విజేత అయిన రాఫెల్ నాదల్.. జనవరిలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ లో పాల్గొనేది అనుమానంగా మారింది. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 30 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఇప్పటికీ కాలిగాయం పూర్తిగా మానకపోవడం, ఇప్పుడు కరోనా బారిన పడటంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ లో అతడు పాల్గొనడంపై సందేహాలు కలుగుతున్నాయి. 


Also Read:  ఈ ఏడాదీ యువరాజ్‌ దొరకలేదు..! ప్రపంచకప్పులు అందలేదు!