Cryptocurrency Prices Today, 21 December 2021: క్రిప్టో మార్కెట్లలో మంగళవారం జోష్ కనిపిస్తోంది. కీలక క్రిప్టోలన్నీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ 5.77 శాతం పెరిగి రూ.38.63 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.69.53 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ 6.30 శాతం పెరిగి రూ.3,19,711 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.36.06 లక్షల కోట్లుగా ఉంది.
బైనాన్స్ కాయిన్ 3.66 శాతం పెరిగి రూ.42,596, టెథెర్ 0.07 శాతం పెరిగి రూ.79.80, సొలానా 3.81 శాతం పెరిగి రూ.14,364, కర్డానో 4.02 శాతం పెరిగి రూ.102, యూఎస్‌డీ కాయిన్ 0.10 శాతం పెరిగి రూ.79.82 వద్ద కొనసాగుతున్నాయి. ఫెచ్ ఏఐ, అవలాంచె, ఐఎక్స్‌సీ, స్టార్జ్, ఎయిర్‌స్వాప్, పాలీగన్, బేసిన్ అటెన్షన్ 10-25 శాతం వరకు పెరిగాయి. డీఎఫ్ఐ మనీ, స్టెల్లార్, ట్రూ యూఎస్‌డీ, పాక్స్ డాలర్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
Also Read: Life Insurance Plan Tips: ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలో తికమక పడుతున్నారా? ఈ 4 స్టెప్స్ చూడండి మరి!
Also Read: SBI FD Rates: గుడ్‌న్యూస్..! ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేటు పెంచిన ఎస్‌బీఐ
Also Read: New Online Payment Rules: జనవరి 1 నుంచి ఆన్‌లైన్ పేమెంట్ నిబంధనల్లో మార్పు.. తెలియకపోతే కష్టం!
Also Read: Multibagger stock: ఐదేళ్లు: ఈ షేరులో లక్షకు రూ.5 లక్షల లాభం!
Also Read: Stock Market: రూ.2,61,812 కోట్లు పతనమైన టాప్-10 కంపెనీల మార్కెట్ విలువ