New Online Payment Rules: జనవరి 1 నుంచి ఆన్‌లైన్ పేమెంట్‌ నిబంధనల్లో మార్పు.. తెలియకపోతే కష్టం!

ఇకపై వ్యాపారస్థుల గేట్‌వేల నుంచి భద్రపరిచిన కస్టమర్ల వివరాలను తొలగించాలని ఆర్‌బీఐ ఆదేశించింది. లావాదేవీలు కొనసాగించేందుకు డేటాకు బదులుగా ఎన్‌క్రిప్ట్‌ చేసిన టోకెన్లను వాడాలని సూచించింది.

Continues below advertisement

క్రెడిట్‌, డెబిట్‌ కార్డు యూజర్ల సమాచార భద్రతకు భారతీయ రిజర్వు బ్యాంకు నడుం బిగించింది. ఇకపై వ్యాపారస్థుల గేట్‌వేల నుంచి భద్రపరిచిన కస్టమర్ల వివరాలను తొలగించాలని ఆదేశించింది. లావాదేవీలు కొనసాగించేందుకు డేటాకు బదులుగా ఎన్‌క్రిప్ట్‌ చేసిన టోకెన్లను వాడాలని సూచించింది. 2022, జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది.

Continues below advertisement

ఇప్పటికే సందేశాలు
ఇకపై క్రెడిట్‌, డెబిట్‌ కార్డు సమాచారాన్ని తమ వద్ద తొలగిస్తున్నామని బ్యాంకులు ఇప్పటికే కస్టమర్లకు సందేశాలు పంపిస్తున్నాయి. '2022, జనవరి 1 నుంచి మీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డు సమాచారం వ్యాపారస్థులు వెబ్‌సైట్‌ లేదా యాప్స్‌ నుంచి తొలగిస్తున్నాం. ఇకపై మీరు చెల్లింపులు చేసేందుకు కార్డుల వివరాలు ఇచ్చే బదులు టోకెనైజేషన్‌ ఉపయోగించుకోవాలి' అని వారం నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తోంది.

ఆర్‌బీఐ ఆదేశాలు
2020, మార్చిలోనే ఆర్‌బీఐ టోకెనైజేషన్‌ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై వ్యాపారస్థులు కస్టమర్ల కార్డు వివరాలను తమ వెబ్‌సైట్లు, యాప్స్‌లో భద్రపరచొద్దని వెల్లడించింది. టోకెనైజేషన్‌కు సంబంధించిన నిబంధనలు అమలు చేసేందుకు ఈ ఏడాది చివరి వరకు అవకాశం ఇస్తున్నట్టు 2021, సెప్టెంబర్లో ఆర్‌బీఐ తెలిపింది. ఇప్పటి వరకు భద్రపరిచిన సమాచారం 2022, జనవరి 1లోపు తొలగించాలని ఆదేశించింది.

టోకెనైజేషన్‌ ఇలా పనిచేస్తుంది
మీరు లావాదేవీలు చేపట్టేటప్పుడు డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు వివరాలను నమోదు చేస్తుంటారు. కార్డు మీదున్న 16 అంకెలు, కార్డు ఎక్స్‌పైరీ డేట్‌, సీవీవీ, ఓటీపీ, పిన్‌ వివరాలు ఎంటర్‌ చేస్తుంటారు. అవన్నీ సరిగ్గా ఉంటేనే లావాదేవీ చెల్లుతుంది. ఈ ప్రకియనంతా ఇకపై టోకెనైజేషన్‌ భర్తీ చేస్తుంది. ఇందుకు మీ కార్డు వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు. బదులుగా మీ కార్డుకు సంబంధించిన టోకెన్‌ను నమోదు చేస్తే చాలు.

జనవరి నుంచి కార్డుల ద్వారా మీరు లావాదేవీలు చేపట్టాలంటే మొదటి సారి మీ అంగీకారం తెలియజేస్తూ అదనపు అథెంటికేషన్‌ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీ కార్డు నెట్‌వర్క్‌ సంస్థకు టోకెనైజేషన్‌ రిక్వెస్ట్‌ వెళ్తుంది. వారు టోకెన్‌ సృష్టించి మర్చంట్‌కు  పంపిస్తారు. వేరే మర్చంట్‌ వద్ద వేరే కార్డుతో లావాదేవీ చేయాలన్నా ఇదే పద్ధతి అనసరించాలి. అప్పుడు మర్చంట్‌ మీ టోకెన్‌ నంబర్‌ భద్రపరచుకుంటారు. మళ్లీ ఉపయోగించినప్పుడు మీ సీవీవీ, ఓటీపీ ఎంటర్‌ చేస్తే చాలు.

Also Read: Salary Structure Change: శాశత్వంగా WFH చేస్తున్నారా..! అయితే HRA కట్‌.. పెరగనున్న పన్ను భారం!

Also Read: Digital Payments in 2021: క్రెడిట్‌ కార్డు యూజర్లు కేక! డిజిటల్‌ చెల్లింపుల మీదే రూ.39,000 కోట్లు ఖర్చు

Also Read: Global Spam Report 2021: ఇండియాలో పాపులర్‌ స్కామ్‌ ఏంటో తెలుసా? అకౌంట్లో మీ డబ్బు జాగ్రత్త!!

Also Read: Rakesh Jhunjhunwala: 10 నిమిషాల్లో రూ.318 కోట్లు నష్టపోయిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా!

Also Read: Life Insurance Plan Tips: ఏ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలో తికమక పడుతున్నారా? ఈ 4 స్టెప్స్‌ చూడండి మరి!

Also Read: Koo App: మనసుకు నచ్చింది 'కూ'సేయండి.. దూసుకెళ్తున్న #KooKiyaKya క్యాంపెయిన్

 

Continues below advertisement
Sponsored Links by Taboola