దేశంలో కొత్తగా 7,081 కరోనా కేసులు నమోదుకాగా 264 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 83,913కు చేరింది. 570 రోజుల్లో ఇదే అత్యల్పం. నిన్న ఒక్కరోజే 12 లక్షల కరోనా శాంపిళ్లను పరీక్షించారు.







మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.24గా ఉంది. గత ఏడాది మార్చి నుంచి ఇదే అత్యల్పం. 


వ్యాక్సినేషన్..







దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు 137 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 


ఒమిక్రాన్


దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 143కు పెరిగింది. కర్ణాటకలో కొత్తగా 6 కేసులు నమోదుకాగా కేరళలో 4 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్రలో 8 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కొత్తగా 12 కేసులు నమోదుకాగా అక్కడ మొత్తం కేసుల సంఖ్య 20కి చేరింది.


ఇప్పటివరకు 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. మహారాష్ట్ర (48), దిల్లీ (22), రాజస్థాన్ (17), కర్ణాటక (14), తెలంగాణ (20), గుజరాత్ (7), కేరళ (11), ఆంధ్రప్రదేశ్ (1), చండీగఢ్ (1), తమిళనాడు (1), బంగాల్ (1) కేసులు నమోదయ్యాయి.


Also Read: Koo App: 'నచ్చిన, వచ్చిన భాషలో 'కూ'సేయండి.. స్వేచ్ఛగా, మరింత సులభంగా'


Also Read: ABP Desam On Koo: తాజా వార్తల కోసం కూ యాప్‌లో ఏబీపీ దేశంను ఫాలో అవ్వండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి