Yoga or Gym Which is Better : ఆరోగ్యంగా ఉండాలనే అందరూ చూస్తారు. దానికోసమే జీవనశైలిలో మార్పులు చేస్తారు. తీసుకునే ఆహారం విషయంలో కూడా కొన్ని కండీషన్స్ పెట్టుకుంటారు. వీటితోపాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి.. కొందరు జిమ్‌కి, మరికొందరు యోగా, మరికొందరు ఇతర పనులు చేస్తూ శారీరకంగా యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉండేందుకు యోగా మంచిదా? జిమ్ చేయడం మంచిదా? నిపుణుల సూచనలు ఏంటి?
ఎక్కవకాలం ఆరోగ్యంగా ఉండాలనుకుంటే యోగా, జిమ్ కూడా మంచి ప్రయోజనాలే ఇస్తాయి. అయితే మీ లైఫ్ స్టైల్, పర్సనల్ గోల్స్, ఆరోగ్య పరిస్థితిని బట్టి వీటిని ఎంచుకుంటే మంచిది. అయితే యోగాతో కలిగే లాభాలు ఏంటి? జిమ్‌తో కలిసి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? అనేది తెలుసుకుంటే.. మీ లైఫ్‌స్టైల్, టైమ్‌కి తగ్గట్లు వాటిని ఎంచుకోవడం సులభమవుతుంది.
యోగాతో కలిగే లాభాలు
యోగా శరీరానికి మంచి ఫ్లెక్సీబిలిటీని అందిస్తుంది. భంగిమను ఫిక్స్ చేసుకోవడం కోసం మీరు యోగా ట్రై చేయవచ్చు. కాబట్టి కండర సమస్యలు, కాళ్లు పట్టేయడం వంటి సమస్యలు ఎక్కువగా ఉండవు. జాయింట్ హెల్త్ మెరుగవుతుంది. అలాగే యోగా ఒత్తిడిని, యాంగ్జైటీని తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. వర్క్, ఫ్యామిలీ విషయంలో స్ట్రెస్‌ని ఎదుర్కొనేవారు దీనిని తమ రొటీన్లో చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
యోగాలో శ్వాస ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనివల్ల ఫోకస్ పెరుగుతుంది. చేసే పనిపై ఈజీగా దృష్టిపెట్టగలుగుతారు. యోగా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అందరూ తమ రోజూవారీ జీవితంలో చేర్చుకోవచ్చు. ఫిట్నెస్ కావాలనుకునే ప్రతి ఒక్కరూ దీనిని ఈజీగా ఎంచుకోవచ్చు.
జిమ్‌తో కలిగే లాభాలు
వయసు పెరిగే కొద్ది కండర బలం తగ్గుతుంది. కానీ రెగ్యులర్‌గా జిమ్ చేస్తే కండర బలం పెరుగుతుంది. దీనివల్ల మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది మంచి ఎంపిక. మెటబాలీజం లెవెల్స్ పెంచి.. ఖాళీగా ఉన్నా కేలరీలు బర్న్ చేయగలుగుతారు. దీనివల్ల శరీరంలో ఫ్యాట్ పేరుకుపోకుండా ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
బోన్ డెన్సిటీ పెరుగుతుంది. ఎముకల సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. బరువులు ఎత్తడం, కార్డియో, HIIT వంటివి చేస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. మొదట్లో కాస్త నొప్పులు అనిపించినా.. రోజులు గడిచే కొద్ది మీరు మరింత యాక్టివ్‌గా మారుతారు.
ఏది మంచిదంటే..
జిమ్, యోగా.. ఆరోగ్యానికి రెండూ మంచివే. మానసికంగా, ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటే మీరు యోగాను ఎంచుకోవచ్చు. కండర బలం, గుండె ఆరోగ్యం, ఫిట్నెస్ కోరుకుంటే జిమ్ చేయవచ్చు. మీ శరీరతత్వం.. మీకు కావాల్సిన, మీ అవసరాలను బట్టి వీటిని ఎంచుకోవచ్చు. లేదంటే రెండూ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మీకు తెలియట్లేదు అంటే మీరు నిపుణుల సలహా తీసుకుంటే మరింత మంచిది.