Tips to Break Phone Addiction : ఫోన్ ఎక్కువగా వాడేస్తున్నారా? ఈ టిప్స్‌తో తగ్గించుకోండిలా
హీరో నాగార్జున చెప్పినట్టు డబ్బు సంపాదించాలంటే ఫోన్‌ని పక్కన పెట్టాలట. దానిని పక్కన పెట్టి కెరీర్‌పై ఫోకస్ పెడితే ఆర్థికంగానే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే ఈ ఫోన్ వాడకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
మొబైల్ వాడుతున్నప్పుడు స్క్రీన్ లిమిట్ పెట్టుకోండి. ముఖ్యంగా కొన్ని యాప్స్ వినియోగించేప్పుడు ఎక్కువసేపు దానిలో ఉండకుండా స్క్రీన్ లిమిట్ పెట్టుకుంటే అలెర్ట్ వస్తుంది. దీంతో వాడకం కాస్త తగ్గే అవకాశముంది.
తింటున్నప్పుడు, బెడ్రూమ్లో, వర్క్ చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఫోన్ ఉపయోగించకూడదనే నిబంధనను పెట్టుకోండి. దీనివల్ల కూడా వినియోగం కంట్రోల్ అవుతుంది.
అవసరం లేనప్పుడు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టా వంటి యాప్స్ నుంచి నోటిఫికేషన్లు ఆఫ్‌లో పెట్టుకుంటే మంచిది. దీనివల్ల చేసేపనిలో డిస్ట్రాక్షన్ ఉండదు.
ఫోన్లో గేమ్స్ ఆడకుండా ఆఫ్‌లైన్ హాబీలు నేర్చుకోండి. పెయింటింగ్, వంట, వ్యాయామం, బుక్స్ చదవడం వంటి వాటివల్ల ఫోన్ వినియోగం తగ్గుతుంది.
రెగ్యులర్‌గా స్క్రీన్ టైమ్స్ చెక్ చేయండి. దీనివల్ల మీరు ఎంతసేపు వినియోగిస్తున్నారో.. ఎంత అవసరానికి ఉపయోగించారో తెలుస్తుంది. ఇది క్రమంగా ఫోన్ వినియోగాన్ని తగ్గిస్తుంది.