భారత్‌లో అత్యంత విలువైన పదింట్లో ఎనిమిది కంపెనీల మార్కెట్ విలువ గతవారం భారీగా పడిపోయింది. ఈ విలువ రూ.2,61,812 కోట్లుగా ఉంది. అత్యధికంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టపోగా ఇన్ఫోసిస్, విప్రో మాత్రమే లాభపడ్డాయి.
గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 1774 పాయింట్లు లేదా 3.01 శాతం మేర పతనమైంది. దాంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.79,658 కోట్లు నష్టపోయి రూ.15,83,118 కోట్లకు పరిమితమైంది. హెచ్డీఎఫ్సీ విలువ రూ.34,690 కోట్లు తగ్గి రూ.5,24,052 కోట్లకు చేరుకుంది. బజాజ్ ఫైనాన్స్ విలువ రూ.33,152 కోట్లు తగ్గి రూ.4,16,597 కోట్లుగా ఉంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు విలువ రూ.27,298 కోట్లు పతనమై రూ.8,16,229 కోట్లుగా ఉంది. హిందుస్థాన్ యూనిలివర్ విలువ రూ.24,083 కోట్లు తగ్గి రూ.5,24,052 కోట్లుగా ఉంది. భారతీయ స్టేట్ బ్యాంక్ విలువ రూ.24,051 కోట్లు తగ్గి రూ.4,17,448 కోట్లుగా ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు విలువ రూ.20,623 కోట్లు పతనమై రూ.5,05,547 కోట్లుగా మారింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ విలువ రూ.18,254 కోట్లు తగ్గి రూ.13,26,923 కోట్లకు పరిమితమైంది.
టీసీఎస్ మార్కెట్ విలువ తగ్గితే అందుకు భిన్నంగా ఇన్ఫోసిస్ విలువ మాత్రం రూ.26,515 కోట్లు పెరిగి రూ.7,66,123 కోట్లకు చేరుకుంది. విప్రో విలువ రూ.17,450 కోట్లు పెరిగి రూ.3,67,126 కోట్లుగా ఉంది. టాప్-10లో రిలయన్స్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, విప్రో వరుసగా నిలిచాయి.
Also Read: Salary Structure Change: శాశత్వంగా WFH చేస్తున్నారా..! అయితే HRA కట్.. పెరగనున్న పన్ను భారం!
Also Read: Global Spam Report 2021: ఇండియాలో పాపులర్ స్కామ్ ఏంటో తెలుసా? అకౌంట్లో మీ డబ్బు జాగ్రత్త!!
Also Read: Rakesh Jhunjhunwala: 10 నిమిషాల్లో రూ.318 కోట్లు నష్టపోయిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా!
Also Read: Life Insurance Plan Tips: ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలో తికమక పడుతున్నారా? ఈ 4 స్టెప్స్ చూడండి మరి!
Also Read: Koo App: మనసుకు నచ్చింది 'కూ'సేయండి.. దూసుకెళ్తున్న #KooKiyaKya క్యాంపెయిన్