టీమ్‌ఇండియాతో టెస్టు సిరీసుకు ముందు దక్షిణాఫ్రికాకు షాక్! ఆ జట్టు ప్రధాన పేసర్ ఆన్రిచ్ నార్జ్ సిరీస్ మొత్తానికి దూరమవుతున్నాడు. అతడింకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని దక్షిణాఫ్రికా క్రికెట్ సంఘం వెల్లడించింది. సఫారీలు ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌లో పాయింట్లు సాధించాలంటే అతడు జట్టులో ఉండటం కీలకం.
'టీమ్‌ఇండియాతో మూడు టెస్టుల సిరీసుకు ప్రోటీస్ బౌలర్ ఆన్రిచ్ నార్జ్ దూరమవుతున్నాడు. అతడింకా గాయం నుంచి కోలుకోలేదు. టెస్టు మ్యాచు బౌలింగ్ ఫిట్‌నెస్ స్థాయికి అందుకోలేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకొనేందుకు అతడు నిపుణులను సంప్రదిస్తున్నాడు. అతడి స్థానంలో మరెవరినీ తీసుకోలేదు' అని సీఎస్‌ఏ ప్రకటించింది.
'బాకింగ్స్ డే ఆరంభమవుతున్న తొలి టెస్టుకు దక్షిణాఫ్రికా పూర్తిగా సిద్ధమైంది. ఈ ఏడాది జులైలో వెస్టిండీస్‌కు వెళ్లిన తర్వాత సఫారీలకు ఇదే పూర్తిస్థాయి టెస్టు సిరీసు. ఆ సిరీసును దక్షిణాఫ్రికా 2-0తో గెలిచింది' అని సీఎస్‌ఏ వెల్లడించింది.
భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు మ్యాచ్ డిసెంబర్ 26న సెంచూరియన్ సూపర్‌స్పోర్ట్ పార్క్ వేదికగా మొదలవుతోంది. ఈ సిరీసుకు రోహిత్ శర్మ అందుబాటులో ఉండటం లేదన్న సంగతి తెలిసిందే. పిక్క కండరాల గాయంతో అతడు జట్టుకూ దూరమయ్యాడు. బెంగళూరులోని ఎన్‌సీఏలో కోలుకుంటున్నాడు. అతడిక స్థానంలో ప్రియాంక్ పంచాల్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఇక కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది.
Also Read: Watch Video: పడక గదిలో భార్య పక్కనుంటే.. అర్ధరాత్రి స్టీవ్ స్మిత్ ఏం చేస్తున్నాడో చూడండి!
Also Read: IND vs SA, 1st Test: భారత్- సౌతాఫ్రికా తొలి టెస్ట్‌లో గ్యాలరీలు ఖాళీ.. ఒమిక్రాన్ భయంతోనే!
Also Read: Rafael Nadal Covid Positive: టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ కు కరోనా... ట్వీట్ చేసిన రఫా...