ప్రస్తుతం ఏపీలో సినిమా థియేటర్లలో టికెట్ రేట్స్‌ను అధికార వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో నేల టికెట్ రేటు రూ. 5 కూడా ఉంది. ఆ లెక్కన టికెట్లు అమ్మితే నష్టాలు తప్పవని కొన్ని థియేటర్లను యాజమాన్యాలు స్వచ్ఛందంగా మూసి వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరో నాని సంచనల వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.


టికెట్ రేట్లు తగ్గించి ఏపీ ప్రభుత్వం ప్రేక్షకులను అవమానించిందని హీరో నాని వ్యాఖ్యానించారు. టికెట్ రేటు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని ఆయన అన్నారు. ఇప్పుడు ఏం మాట్లాడినా వివాదాస్పదం అవుతుందని అంటూనే... థియేటర్ కంటే పక్కన ఉన్న కిరాణా కొట్టు కలెక్షన్స్ ఎక్కువ ఉంటున్నాయని నాని నర్మగర్భంగా మాట్లాడారు. థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్ అని అన్నారు. ప్రస్తుతం రోడ్డు పక్కన ఉన్న స్టాల్స్‌లో టీ రేటు పది రూపాయలు ఉంది. సినిమా టికెట్ రేటు అంత కంటే తక్కువ అని, మూడు గంటలు కూర్చోబెట్టి సినిమా చూపిస్తే 5 రూపాయలు ఏంటని సాధారణ ప్రేక్షకులు కూడా నోరెళ్ల బెడుతున్నారు. ఇండస్ట్రీ ప్రముఖులు కొంత మంది బాహాటంగా తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే... ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రేక్షకులు అందరికీ తక్కువ రేటులో వినోదం అందుబాటులోకి తీసుకు రావడం కోసమే టికెట్ రేట్లు తగ్గించామని అంటోంది.


ఏపీలో టికెట్ రేట్స్ గురించి గతంలో కూడా నాని ఓసారి స్పందించారు. 'రిపబ్లిక్' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడిన తర్వాత... ఆయనకు సంఘీభావం తెలుపుతూ నాని ట్వీట్స్ చేశారు. మరోసారి శుక్రవారం 'శ్యామ్ సింగ రాయ్' సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టికెట్ రేట్స్ గురించి స్పందించారు.


Also Read: శ్రీరామ చంద్ర కాళ్లు చూస్తే కన్నీళ్లు ఆగవు... ఎంత పని చేశావ్ 'బిగ్ బాస్'!
Also Read: కొమురం భీముడో... కొమురం భీముడో... ఎన్టీఆర్ సాంగ్ ప్రోమో వచ్చింది! చూశారా?
Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!
Also Read: సంక్రాంతి కూడా అక్కడే ప్లాన్ చేసిన మహేష్ బాబు...
Also Read: 'ఢీ' నుంచి దర్శకేంద్రుడి దగ్గరకు... దీపికా పిల్లి గ్రాఫ్ ఓ రేంజ్‌లో ఉంది మ‌రి!
Also Read: 'భీమ్లా నాయక్' బ్యూటీకి మరో క్రేజీ సినిమాలో ఛాన్స్!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి