Revolt Of BHEEM: కొమురం భీముడో... కొమురం భీముడో... ఎన్టీఆర్ సాంగ్ ప్రోమో వచ్చింది! చూశారా?

'ఆర్ఆర్ఆర్' సినిమా నుంచి మరో సాంగ్ ప్రోమో వచ్చింది. 'రివోల్ట్ ఆఫ్ భీమ్' పేరుతో దీనిని విడుదల చేశారు. ఇది ఎలా ఉందో చూడండి. శుక్రవారం సాంగ్ విడుదల చేయనున్నారు.

Continues below advertisement

కొమరం భీమ్... 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పోషిస్తున్న పాత్ర పేరు. ఆల్రెడీ రిలీజైన టీజర్లు, ట్రైలర్‌లో ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూపించారు. ఇప్పుడు 'రివోల్ట్ ఆఫ్ భీమ్' (Revolt Of BHEEM) పేరుతో ఓ పాట విడుదల చేస్తున్నారు. సినిమాలో నాలుగో పాట ఇది. శుక్రవారం విడుదల కానుంది. నేడు సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆయన తనయుడు కాలభైరవ ఆలపించారు. తెలుగులో సుద్దాల అశోక్ తేజ్ సాహిత్యం అందించారు.
'కొమురం భీముడో...
కొమురం భీముడో...
కొర్రాసు లెగడోలే
మండాలి కొడుకో...
మండాలి కొడుకో... ఓ ఓ ఓ' అంటూ సాంగ్ ప్రోమో సాగింది.
ప్రోమో చివరిలో ఎన్టీఆర్‌ను చూపించారు. అప్పటివరకూ పాట పాడిన కాల భైరవ మీద షూట్ చేశారు. ప్రోమో చూస్తుంటే... లిరికల్ వీడియో కోసం బాగా ఖర్చు చేసినట్టు అర్థం అవుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ రామ్ చరణ్ హీరోలుగా డీవీవీ దానయ్య నిర్మించిన 'ఆర్ఆర్ఆర్'లో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా... అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నటించారు. జనవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీనికి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' టీమ్ ముంబైలో ఉంది. అక్కడ ప్రమోట్ చేస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళిని రానా ఇంటర్వ్యూ కూడా చేశారు.
Emotionally spellbinding Song, #RevoltOfBHEEM - Music Video releasing tomorrow at 4PM.

Continues below advertisement

Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!
Also Read: సంక్రాంతి కూడా అక్కడే ప్లాన్ చేసిన మహేష్ బాబు...
Also Read: 'ఢీ' నుంచి దర్శకేంద్రుడి దగ్గరకు... దీపికా పిల్లి గ్రాఫ్ ఓ రేంజ్‌లో ఉంది మ‌రి!
Also Read: 'భీమ్లా నాయక్' బ్యూటీకి మరో క్రేజీ సినిమాలో ఛాన్స్!
Also Read: 'కనీసం నీకు నువ్వైనా సమాధానం చెప్పుకో'.. దీప్తి స్టేటస్ షణ్ముఖ్ ని ఉద్దేశించేనా..?
Also Read: 'విక్రమార్కుడు' సినిమాకి సీక్వెల్.. కానీ మేటర్ ఏంటంటే..?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola