ఆ ఇంటి యజమాని అందరిలాగే తన ఇంటిని అద్దెకు ఇచ్చాడు. వారి మీద నమ్మకంలో కనీసం ఒక్కరోజు కూడా ఇంట్లోకి వెళ్లి చెక్ చేయలేదు. అద్దెదారులు తాము ఖాళీ చేస్తున్నట్టు చెప్పి వెళ్లిపోయారు. వారు వెళ్లాక ఇంటి ఓనర్ ఆ ఇంట్లోకి వెళ్లాడు. అక్కడున్న పరిస్థితి చూసి షాక్ తిన్నాడు. అది ఇల్లా లేక డంపింగ్ యార్డో ఆయనకు అర్థం కాలేదు. 


బ్రిటన్లోని డానీ హెర్నాన్ తన ఇంటిని వేరే వాళ్లకి అద్దెకు ఇచ్చాడు. ఇప్పుడు 18 ఏళ్ల క్రితం. అప్పట్నించి మూడు బెడ్ రూమ్‌లున్న ఆ ఇంట్లో ఆ కుటుంబమే అద్దెకుంటోంది. ఇల్లు ఖాళీ చేస్తున్నట్టు చెప్పి వాళ్లు వెళ్లిపోయారు. 18 ఏళ్ల నుంచి ఉంటున్నవారే కాబట్టి డానీ కూడా వారిని అనుమానించలేదు. వెళ్లేముందు ఆ అద్దెదారుడు ఇల్లు క్లీన్ చేయడానికి ఎక్కువ ఖర్చవ్వదని కేవలం 500 పౌండ్లు అవుతుందని చెప్పాడు. దీంతో డానీ కూడా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇల్లు ఖాళీ అయ్యాక వేరే వాళ్లకి ఇచ్చేముందు క్లీన్ చేయిద్దామని వెళ్లాడు డానీ. ఇల్లు తెరిచి లోపలికి వెళ్లేసరికి ఆ వాసనకు, అక్కడున్న పరస్థితికి కళ్లు తిరిగాయి డానీకి. 


చెత్తలేని ప్రదేశమే లేదు...
అది ఇల్లు కాదు, డంపింగ్ యార్డ్. ప్రతి చోటా చెత్తా చెదారమే. చెత్తను బయటపడేయకుండా 18 ఏళ్లుగా ఇంట్లోనే పోగేసినట్టున్నారు అద్దెకున్నవాళ్లు. దీంతో అడుగుపెట్టడానికి వీల్లేకుండా చెత్తలో నిండిపోయింది ఇల్లు. బాత్రూమ్ లు మరి చెప్పక్కర్లేదు. మిగిలిన ఆహారపదార్థాలు, కవర్లు, అన్నీ ఇంట్లోనే గుట్టలుగా పడిపోయి ఉన్నాయి. అదంతా క్లీన్ చేయించడానికి ఆ ఓనర్ కు పదిహేను వేల పౌండ్లు ఖర్చుయ్యాయి. అంటే మనరూపాయల్లో పదిహేను లక్షలు. అంత ఖర్చు పెట్టి ఇల్లు శుభ్రం చేయించిన ఓనర్ ఊరుకుంటాడా సదరు అద్దెదారుడిపై పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు. అంతేకాదు తనలా కాకుండా ఇల్లు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోమంటూ మిగతా ఓనర్లను హెచ్చరిస్తున్నాడు. 


Read Also:  ఇంజెక్షన్ అంటే భయమా? మీలాంటివాళ్ల కోసమే సూది లేని ఇంజెక్షన్లు వస్తున్నాయి...


Read Also: చీరకట్టుకూ రవీంద్రనాథ్ ఠాగూర్‌ కుటుంబానికి మధ్య బంధమేంటి?


Read Also: మనోళ్లు మాములుగా తినలేదుగా... నిమిషానికి ఎన్ని బిర్యానీలు కుమ్మేశారో తెలిస్తే షాకవుతారు
Read Also: లెక్కల వల్ల పిచ్చివాడు అవుతాడనుకున్నారు... కానీ ప్రపంచం మెచ్చిన గణిత శాస్త్రవేత్త ఎలా అయ్యారంటే..!
Read Also: ఉల్లి, అన్నం, బ్రెడ్, మొక్కజొన్న... ఇలాంటివి మాడినా కూడా తింటున్నారా? క్యాన్సర్ రావచ్చు జాగ్రత్త






ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.