స్మోకీ ఫుడ్ అంటే చాలా మందికి ఇష్టం. నిప్పులపై కాల్చుకుని తినే ఆహారాన్ని కొనుక్కుని మరీ తింటారు. ఇక ఇళ్లల్లో పెనంపై అట్లు మాడిపోయినా, అన్నం అడుగంటినా, బ్రెడ్ కాస్ల అధికంగా కాలినా కూడా పడేయడం ఎందుకని తినేస్తుంటారు చాలా మంది. కానీ అలా తినడం చాలా ప్రమాదకరమని సూచిస్తున్నారు వైద్యనిపుణులు. కొన్ని అధ్యయనాల్లో ఈ విషయం నిరూపితమైంది.
దానివల్లే క్యాన్సర్
బాగా కాల్చిన లేదా మాడిన ఆహారాలలో అక్రిలమైడ్ అనే రసాయనం ఏర్పడుతుంది. పిండి పదార్థాలను ఎక్కువసేపు అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించినా కూడా ఈ రసాయనం ఏర్పడుతుంది. ఇది క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. సాధారణంగా చూస్తే ఆ ఆహారాలు క్యాన్సర్ కారకాలు కావు, కానీ అవి అధికంగా కాల్చినప్పుడు మాత్రం విషపూరితంగా మారుతాయి. ఈ అంశం గురించి బ్రిటన్ కు చెందిన క్యాన్సర్ రీసెర్చ్ జర్నల్ లో కథనం ప్రచురితమైంది.
వండే పద్ధతుల్లో కూడా...
సాధారణంగా ఇళ్లలో వండుకునే సాంప్రదాయ వంట పద్దతులు మంచివే కానీ, బేకింగ్, బార్బెక్యూ, డీప్ ఫ్రై, గ్రిల్లింగ్, టోస్టింగ్, రోస్టింగ్ వంటి వంద పద్ధతులు మాత్రం ఆరోగ్యానికి హానికరమైనవి. ఇలా వండటప్పుడు కూడా అక్రిలమైడ్ ఏర్పడే అవకాశం చాలా ఎక్కువ. ఇది కేవలం క్యాన్సర్ మాత్రమే కాదు, ఇతర ప్రాణాంతకవ్యాధులకు కూడా కారణం కావచ్చు.
బిర్యానీ కోసం ఉల్లి వేపుడు
బిర్యానీ కోసం ముందుగా నిలువుగా కోసిన ఉల్లితరుగును నూనెలో నల్లగా వేపుతారు. ఆ తరువాత వాటిని బిర్యానీలో కలుపుతారు. అంత నల్లగా మాడేసరికే అందులో అప్పటికే అక్రిలమైడ్ ఉత్పత్తి అయిపోయి ఉంటాది. కాబట్టి నల్లగా మాడ్చిన ఉల్లిపాయలు లేకపోయినా బిర్యానీ రుచి మారదు. కాబట్టి వాటిని దూరం పెడితే మంచిది.
అనేక రకాల క్యాన్సర్ల నుంచి సురక్షితంగా ఉండేందుకు తాజా పండ్లు, కూరగాయలు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అధిక చక్కెర, కొవ్వు, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను చాలా తగ్గించాలి.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Read Also: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీ కిడ్నీలు సరిగా పనిచేయడం లేదనే అర్థం
Read Also: నెలసరి సమయంలో వీటికి దూరంగా ఉండాలి... లేకుంటే నొప్పులు ఎక్కువవుతాయి
Read Also: బీరు తాగితే నిజంగానే బొజ్జ పెరుగుతుందా? పెరగకుండా తాగడం ఎలా?
Read Also: కాఫీని ఇలా తాగితే బరువు తగ్గిపోతారు... ప్రయత్నించండి
Read Also: నందిత బన్నా... శ్రీకాకుళం అమ్మాయి మిస్ సింగపూర్ అయింది, మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొంది
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి