'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాను సంక్రాంతికి విడుదల చేశారు కింగ్ అక్కినేని నాగార్జున. సంక్రాంతి బరిలో మరో మూడు సినిమాలు ఉన్నప్పటికీ... ఆ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. విడుదల అయిన వారం తర్వాత థియేటర్లు కూడా పెరిగాయి. 'సోగ్గాడే చిన్ని నాయనా'కు ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోన్న సినిమా 'బంగార్రాజు'. ఇందులో నాగార్జునతో పాటు ఆయన తనయుడు నాగచైతన్య కూడా హీరోగా నటిస్తున్నారు. ముందు నుంచి ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనేది నాగార్జున ఆలోచన. 'ఎప్పుడు వచ్చినా ఆ సినిమాను సంక్రాంతి పండక్కి తీసుకొస్తా' అని ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. అయితే... 2022 సంక్రాంతి బరిలో తొలుత నాలుగైదు సినిమాలు ఉండటంతో ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత 'ఆర్ఆర్ఆర్', 'భీమ్లా నాయక్', 'రాధే శ్యామ్' ఉన్నప్పుడు ఏదైనా వాయిదా పడితే 'బంగార్రాజు'ను తీసుకురావాలని అనుకున్నారు. ఇప్పుడు 'భీమ్లా నాయక్' వాయిదా పడింది. దాంతో నాగార్జున అండ్ 'బంగార్రాజు' టీమ్ దూకుడు పెంచింది.
"ఈ రోజు 'బంగార్రాజు' సినిమా లాస్ట్ డే షూటింగ్. మరో డాన్స్ నంబర్ వస్తోంది. పండగ లాంటి సినిమా. బంగార్రాజు త్వరలో వస్తాడు" అని నాగార్జున ట్వీట్ చేశారు. నాగచైతన్య, కృతీ శెట్టి మీద పాటను తెరకెక్కిస్తున్నారు. దాంతో షూటింగ్ కంప్లీట్ కానుంది. పండగ లాంటి సినిమా అంటే మీనింగ్ ఏంటి? త్వరలో ఉన్న పండగ ఏంటి? సంక్రాంతే కదా! ఆ పండక్కి సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి, రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో? 'భీమ్లా నాయక్'ను వెనక్కి పంపించడంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కాస్త కోపంగా ఉన్నారు. 'బంగార్రాజు' వస్తే వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
'భీమ్లా నాయక్' వాయిదా పడుతుందని అధికారికంగా ప్రకటించడానికి కొన్ని రోజుల ముందు నుంచి వాయిదా ఖాయమనే వార్తలు వచ్చాయి. నాగార్జున అండ్ టీమ్ అప్పటి నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. సాంగ్స్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఎప్పుడు అయితే... 'భీమ్లా నాయక్' వాయిదా పడిందో? అప్పుడు మరింత దూకుడు పెంచింది. సంక్రాంతి పండక్కి వస్తామని చెప్పడం లేదంతే! ఆ మాట ఒక్కటీ చెప్పకుండా సినిమాను సంక్రాంతి పండక్కి రెడీ చేస్తున్నారు.
Also Read: సంక్రాంతి కూడా అక్కడే ప్లాన్ చేసిన మహేష్ బాబు...
Also Read: 'ఢీ' నుంచి దర్శకేంద్రుడి దగ్గరకు... దీపికా పిల్లి గ్రాఫ్ ఓ రేంజ్‌లో ఉంది మరి!
Also Read: 'భీమ్లా నాయక్' బ్యూటీకి మరో క్రేజీ సినిమాలో ఛాన్స్!
Also Read: 'కనీసం నీకు నువ్వైనా సమాధానం చెప్పుకో'.. దీప్తి స్టేటస్ షణ్ముఖ్ ని ఉద్దేశించేనా..?
Also Read: 'విక్రమార్కుడు' సినిమాకి సీక్వెల్.. కానీ మేటర్ ఏంటంటే..?
Also Read: హీరోయిన్ అవ్వాలనుకుంటున్నారా? ఈ నొప్పిని భరించాల్సిందే.. రష్మిక స్వీట్ వార్నింగ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి