తెలంగాణ రాష్ట్రప్రభుత్వ ప్రకటనతో భవిష్యత్తులో పాడి రైతులకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. వరి సాగుకు చేపట్టక పోవడంతో పశుగ్రాసం కొరత తీవ్రమయ్యే ప్రమాదముంది. ప్రభుత్వ నిర్ణయంతో పశుపోషణ ప్రశ్నార్థకంగా మారనుంది. యాసంగిలో వరి పంట సాగు నిలిచిపోవడంతో గడ్డికి విపరీతమైన డిమాండ్ ఏర్పడి పశుగ్రాసం ధరలు అమాంత పెరిగిపోనున్నాయి. భవిష్యత్తులో తలెత్తే ప్రమాదాలను తలుచుకొని పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాలకులు చేపడుతున్న చర్యల వలన పశుసంపదకు సైతం ప్రాణసంకటం ఏర్పడింది. ప్రభుత్వం ఈ యాసంగిలో వరిపంట వేస్తే సహించేంది లేదని ఆదేశాలు జారీ చేసింది. అంతటితో ఆగకుండా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కఠినంగా వ్యవహరించాలని నిబంధనలు విడుదల చేయటంతో ఇప్పటి వరకు కార్యాలయాలకే పరిమితమైన ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వరిసాగు చేసే వివరాలను సేకరించటంతో పాటు పంట సాగు చేస్తే ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు, పథకాలు ఇక నుంచి రావని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు వరిపంట సాగు విషయంపై వెనుకడుగు వేస్తున్నారు. దీని ప్రభావం వల్ల రానున్న కాలం పశువుల జీవనానికి గడ్డుకాలం ఏర్పడే పరిస్థితులు మెండుగా ఉన్నాయని చెప్పవచ్చు. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పండించిన పంటలను యంత్ర పరికరాల సాయంతో పంట ఉత్పత్తులను ఇంటికి తేలికగా తీసుకురావటంతో పశుగ్రాసంపై వేటు పడుతుంది. యంత్ర పరికరాలు ఉపయోగించటంతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలీలు ఎక్కువ డబ్బులకోసం పట్టణాల్లో పనికి వెళ్లడం, ఒక వేళ కూలీలు దొరికినా ఎక్కువ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయటంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు
యంత్ర పరికరాల వైపే మొగ్గుచూపుతున్నారు. గతంలో కూలీల సహాయంతో వరిపంటను నూర్పిడి చేయగా ఎకరానికి 150 కట్టల వరకు వరిగడ్డి ఇంటికి వచ్చేది. దీంతో ఆయా ఇళ్లల్లో పశువులకు సంమృద్ధిగా వరిగడ్డితో పాటు కంది, మినుము, జొన్న వంటి పంటలు ఇబ్బడిముబ్బడిగా ఉండేది. ప్రస్తుతం యంత్రాల వినియోగించటంతో పశువులకు అవసరమైన గ్రాసం సైతం దూళిగా మారిపోతుంది. ఒక వేళ గడ్డిని వేరుచేసే యంత్రాల గతంలో వచ్చిన మేరకు గడ్డి ఉత్పత్తి రావటం లేదు. కేవలం నుంచి 100 కట్టల వరకు మాత్రమే గడ్డి లభిస్తుంది. ఇది క్రమక్రమంగా పెరిగిపోతూనే ఉంది. ఈ నేపథ్యంలో రైతులు వేరే ప్రాంతాల వైపు చూడాల్సి వస్తుంది. దీంతో వ్యాపారులు సైతం పశుగ్రాసం, దానా రేట్లు విపరీతం పెంచుతున్నారు. బహిరంగ మార్కెట్లో ఒక వరిగడ్డి మోపు రూ.150 వరకు చొప్పున ట్రాక్టర్ లో తీసుకొని వచ్చే 70 మోపులకు దాదాపుగా రూ.9వేల వరకు విక్రయిస్తూన్నారు. పశువుల గ్రాసం సరిపడినంత ఉన్నప్పటికి మార్కెట్ లో గ్రాసం ధరం ఏమాత్రం తగ్గించలేదు. పాడి రైతులు ఖర్చులను భరిస్తూ ఎక్కువ డబ్బులతో గ్రాసం కొని పశువులను సాకుతున్నారు. అయితే ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ లో వరి పంటను కోయడంతో ఆ పంటల ద్వారా వచ్చిన గడ్డి కేవలం 4నెలల వరకు మాత్రమే పశువులకు సరిపోయే అవకాశాలున్నాయి.
ఈ యాసంగిలో వరి పంట సాగు చేయకపోవడంతో గడ్డి కొరత ఏర్పడటం ఖాయమని రైతులు అభిప్రాయ పడుతున్నారు. భవిష్యత్తులో పశువులకు గడ్డిలేక గోస పడక తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాసంగిలో వరిపంట వద్దనే పాలకులు పశుగ్రాసం విషయంలో ఎటువంటి ఆలోచన లేకుండా తొందరపాటు నిర్ణయం పశువులపాలిట శాపంగా మారింది. ఈ ప్రభావంతో పశుపోషణ భారమైన రైతులకు పశు సంపదను కబేళాలకు విక్రయించే గడ్డు పరిస్థితులు ఏర్పడనున్నాయి.
Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!
Also Read: సంక్రాంతి కూడా అక్కడే ప్లాన్ చేసిన మహేష్ బాబు...
Also Read: 'ఢీ' నుంచి దర్శకేంద్రుడి దగ్గరకు... దీపికా పిల్లి గ్రాఫ్ ఓ రేంజ్‌లో ఉంది మరి!
Also Read: 'భీమ్లా నాయక్' బ్యూటీకి మరో క్రేజీ సినిమాలో ఛాన్స్!
Also Read: 'కనీసం నీకు నువ్వైనా సమాధానం చెప్పుకో'.. దీప్తి స్టేటస్ షణ్ముఖ్ ని ఉద్దేశించేనా..?
Also Read: 'విక్రమార్కుడు' సినిమాకి సీక్వెల్.. కానీ మేటర్ ఏంటంటే..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి