ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న అంశంపై దాఖలైన పిటిషన్‌పై గురువారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఒమిక్రాన్ ఆందోళన ఉన్నందున క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాక, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కూడా కరోనా పరీక్షలు చేయాలని సూచించింది. వచ్చే వారం రోజులు వేడుకలు ఉన్నందున ప్రజలు గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.






తెలంగాణ ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లోగా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఎయిర్‌పోర్ట్‌లో పరీక్షలు చేస్తున్న విధంగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలకు తగిన పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే కోవిడ్‌ నిబంధనలను విధించారో.. అదే రీతిలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. ఆ రాష్ట్రాల్లో ఇప్పటికే ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.


Also Read: Rajanna Sircilla: తెలంగాణలో ఒమిక్రాన్ దడ.. ఈ ప్రాంతంలో ప్రజలంతా కలిసి సెల్ఫ్ లాక్‌డౌన్


తెలంగాణలో కొత్తగా 14 ఒమిక్రాన్ కేసులు
మరోవైపు, తెలంగాణలో ఒమిక్రాన్‌ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా 14 ఒమిక్రాన్‌ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం కేసుల సంఖ్య 38కి చేరింది. 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన 259 మందికి కోవిడ్‌ ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయగా.. వీరిలో నలుగురికి కోవిడ్ పాజిటివ్‌ వచ్చింది. ఈ నలుగురి నమూనాలను అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ఇప్పటి వరకు ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన 9,381 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 63 మందికి కరోనా నిర్థారణ అయ్యింది. వారిలో 22 మందికి ఒమిక్రాన్‌ నెగెటివ్‌ వచ్చిందని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మిగిలిన వారిలో 38 మందికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌ అని తేలింది. మరో నలుగురి ఫలితాలు ఇంకా రావాల్సిఉంది. 


తెలంగాణలో గడచిన 24 గంటల్లో 37,353 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ నమూనాల్లో 182 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,80,074 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కోవిడ్ బులిటెన్‌ లో ఈ వివరాలు వెల్లడించింది. గడచిన వ్యవధిలో కరోనాతో ఒక్కరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు 4,017 మంది మరణించారు. కరోనా బారి నుంచి మంగళవారం 196 మంది కోలుకున్నారు. తెలంగాణలో ఇంకా 3,610 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


Also Read: మద్యం ధరలపై వాగ్వాదం... టీడీపీ కార్యకర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు !


Also Read: Delmicron Varient: ఒమిక్రాన్ తర్వాత పొంచి ఉన్న మరో వేరియంట్, ఆ రెండూ కలిసిపోయి కొత్తగా.. దీని తీవ్రత ఎంతంటే..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి