ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ ప్రాంతంలో ఓ యువకుడి ప్రైవేట్ పార్ట్‌లను నరికివేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు హత్య, కిడ్నాప్ సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు గురించి ఢిల్లీ పశ్చిమ మండల డీసీపీ ప్రశాంత్ గౌతమ్ మాట్లాడుతూ.. గురువారం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుండి పీసీఆర్ కాల్ వచ్చిందని, ఇందులో రాజౌరి గార్డెన్‌కు చెందిన వ్యక్తిని తీవ్రంగా గాయపడిన స్థితిలో ఆసుపత్రికి తీసుకువచ్చారని చెప్పారని తెలిపారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల బాధితుడి కుటుంబం రఘువీర్ నగర్‌లో నివసిస్తుంది. కాగా, సాగర్‌పూర్‌కు చెందిన 20 ఏళ్ల యువతితో దాదాపు రెండేళ్లుగా అతను ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. అంతే కాదు పెళ్లి చేసుకోవడం కోసం అమ్మాయి తరపు కుటుంబ సభ్యులను అందరినీ ఒప్పించే ప్రయత్నం చేసినా ఎవరూ అంగీకరించలేదు. దీంతో చేసేది లేక యువకుడు, యువతి పారిపోయి గత డిసెంబర్ 21న జైపూర్ చేరుకున్నారు. అక్కడ ఓ గుడిలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. దీని తరువాత డిసెంబర్ 22 న, ఇద్దరూ ఢిల్లీకి తిరిగి వచ్చి రాజౌరీ గార్డెన్ ప్రాంతంలో ఉన్నారు. అనంతరం ఇద్దరు కలిసి ఉంటున్న విషయం బాలిక తరపు కుటుంబ సభ్యులకు తెలిసింది.
మొదట తీవ్రంగా కొట్టి ఆ తర్వాత...
యువకుడు, యువతి రాజౌరి గార్డెన్‌లో ఉంటున్న విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు వారు ఉంటున్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఇద్దరినీ తనతో పాటు సాగర్‌పూర్‌కు తీసుకెళ్లాడు. యువతి కుటుంబ సభ్యులు ముందుగా యువకుడిపై దాడి చేసి, మరో చోటికి తీసుకెళ్లి పదునైన ఆయుధంతో అతని జననాంగాలను కోసేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఆ తర్వాత యువకుడిని సాగర్‌పూర్‌లోని అడవిలో పడేశారు. దీని తరువాత, పోలీసులకు గురువారం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుండి కాల్ వచ్చింది, అందులో రాజౌరి గార్డెన్‌కు చెందిన వ్యక్తి గాయపడిన స్థితిలో ఆసుపత్రికి తీసుకొచ్చారని ఆస్పత్రి వర్గాలు పోలీసులతో చెప్పారు.
బాలిక పారిపోయి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా ప్రియుడ్ని పెళ్లి చేసుకుందనే కోపంతోనే బాలిక కుటుంబ సభ్యులు ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో యువకుడిని కిడ్నాప్ చేసి, మొదట కొట్టి, ఆపై అతని ప్రైవేట్ పార్ట్ కోసి, సాగర్‌పూర్ ప్రాంతంలో విసిరి పారిపోయాడు. ప్రస్తుతం, యువకుడిని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అదే సమయంలో నిందితుల తరఫు కొందరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Also Read: Divorce: దుబాయ్ రాజు విడాకులు.. భార్యకు భరణం ఎన్ని కోట్లు చెల్లించాలో తెలుసా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి