పెళ్లి చేసుకుంటానంటే శారీరకంగా కలిశామని .., ఇప్పుడు పెళ్లి చేసుకోనంటున్నాడని పోలీసులకు ఎన్నో ఫిర్యాదులు వస్తూంటాయి. పెళ్లి పేరుతో శారీరక అవసరాలు తీర్చుకుని తర్వాత సంబంధం లేదని  చెప్పేవారు కోకొల్లలుగా ఉంటారు. అయితే ఇలాంటి కేసుల్లో  వారి మధ్య శారీరక సంబంధం పెళ్లి  చేసుకుంటానన్న హామీతోనే ఏర్పడిందా లేదా అన్నదే కీలకం. ఈ విషయంలో న్యాయస్థానాలు ఆసక్తికరమైన తీర్పులు ఇస్తూ ఉంటాయి. తాజాగా బాంబై హైకోర్టు ఓ కేసులో ఇచ్చిన తీర్పు ఇప్పుడు హైలెట్ అవుతోంది.


Also Read: ఆన్‌లైన్ వాదనలు మానేసి మహిళతో సరసాలు... హైకోర్టు లాయర్‌పై బ్యాన్ ! ఎక్కడో కాదు ...


పాతికేళ్ల కిందట జరిగినట్లుగా చెబుతున్న నేరంలో నిందితుడు మహిళలతో శారీరకసంబంధం పెట్టుకున్నారు.  కానీ పెళ్లి  చేసుకోలేదు. మూడేళ్ల పాటు ఇరువురి మధ్య శారీరక సంబంధం ఉంది తర్వాత విడిపోయారు. ఈ జంటలో మహిళ ... పెళ్లి చేసుకుంటానన్న హామీతో మూడేళ్ల పాటు శారీరక సంబంధం పెట్టుకున్నారని... తర్వాత పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారని పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఈ కేసులో మూడు సంవత్సరాల విచారణ తర్వాత, పాల్ఘర్‌లోని అదనపు సెషన్స్ జడ్జి IPC సెక్షన్ 417 ప్రకారం శిక్షార్హమైన నేరాలకు నిందితుడిని దోషిగా నిర్ధారించారు. అనంతరం అతనికి ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. 


Also Read: భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పెళ్లి.. రక్తదానమే గిఫ్ట్.. అవయవ దానమే ఆశీర్వాదం


అయితే యువకుడు మాత్రం తానేం తప్పు చేయలేదని.. తమ మధ్య ఉన్న శారీరక సంబంధం ఇద్దరి అనుమతితోనే జరిగిందని.. పెళ్లి చేసుకుంటామన్న హామీతో  లైంగికంగా కలవలేదని వాదించారు. తనకు కిందికోర్టు విధించిన  శిక్షను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణ జరిపిన హైకోర్టు... పలువురు సాక్షుల్ని.. అనేక డాక్యుమెంట్లను.. పరిశీలించి తీర్పు చెప్పింది. వారి మధ్య లైంగిక సంబంధం ఏకాభిప్రాయానికి సంబంధించినదని రికార్డుల్లో ఉన్న ఆధారాలు సూచిస్తున్నాయని.. పెళ్లి చేసుకుంటామన్న షరతుతో వారి మధ్య శారీరక సంబంధం ఏర్పడలేదని తీర్పు చెప్పింది. కేసు నుంచి ఆ వ్యక్తిని విముక్తుడ్ని చేసింది. పాతికేళ్ల పాటు పోరాడిన ఆ వ్యక్తి చివరికి కేసు నుంచి విముక్తుడయ్యాడు. 


Also Read: YouTube Channels Blocked: పాకిస్తాన్‌కు భారీ షాక్.. 20 యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్‌సైట్స్ బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం


ప్రేమ, పెళ్లి  మధ్యలో శారీరక సంబంధం అంశం ఎప్పుడూ వివాదాస్పదమే. ఇద్దరు మేజర్లు  పరస్పర అంగీకారంతో శృంగారం చేసుకుంటే అది నేరం కాదు. కానీ ఇలాంటి శృంగారం చేసుకున్న తర్వాత మహిళ .. పెళ్లి  చేసుకుంటానన్న హామీతో అలా  శారీరకంగా కలిసి .. తర్వాత మోసం చేశారని ఫిర్యాదు  చేసినప్పుడే సమస్యలు వస్తున్నాయి. దీనిపై న్యాయస్థానాల్లోనూ  భిన్నమైన తీర్పులు వస్తూ ఉంటాయి. 


Also Read: Divorce: దుబాయ్ రాజు విడాకులు.. భార్యకు భరణం ఎన్ని కోట్లు చెల్లించాలో తెలుసా


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి