కొత్త ఏడాది వచ్చిందంటే చాలు... ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ట్రిప్పులు ప్రారంభమవుతాయి. ఎక్కడికి వెళ్లాలో అంతా మాట్లాడుకుని బయలుదేరుతారు. మేము కూడా కన్ని చక్కని ప్రదేశాలను సూచిస్తున్నాం. ఈ ప్రదేశాలు కూడా కొత్త ఏడాది సంబరాలు చేసుకునేందుకు పర్‌ఫెక్ట్ ప్రదేశాలే.
ముస్సోరీ
‘ద క్వీన్ ఆఫ్ హిల్స్’... ముస్సోరీలో కొత్త ఏడాదికి ప్రత్యేకంగా సిద్ధమయ్యే ప్రదేశం. దీనిపై బోలెడన్ని కెఫెలు, సంగీత కార్యక్రమాలు, ఇంకా ఎన్నో ఆటలు, అతిధి మర్యాదలు అదిరిపోతాయి.
జైపూర్
జైపూర్ చాలా పాపులర్ సిటీ. పింక్ సిటీలో పిలిచే ఈ నగరంలో అనేక కోటలు ఉన్నాయి. ఆ కోటల్లో అనేక రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. కొత్తఏడాదికి అక్కడ ఉంటే ఎంజాయ్ చేయచ్చు.
గ్యాంగ్టక్
సముద్రానికి 1437 మీటర్ల ఎత్తులో ఉన్న నగరం గ్యాంగ్టక్. పచ్చదనం మధ్య ఎన్న పబ్‌లు, డిస్కోలు కొత్త ఏడాది కోసం సిద్ధమైపోతాయి. స్నేహితులతో వస్తే మర్చిపోలేని అనుభూతులు మూటగట్టుకోవడం ఖాయం.
కాసోల్
హిమాచల్ ప్రదేశ్‌లో ఓ అందమైన గ్రామం కాసోల్. పర్వతాల నడుము ఉన్న ఈ గ్రామాన్ని చూస్తే స్వర్గమే దిగొచ్చినట్టు కనిపిస్తుంది. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలంటే కాసోల్ బెస్ట్ ప్లేస్.
గోకర్ణ
బెస్ట్ బీచ్ డెస్టినేషన్ గోకర్ణ (కర్ణాటక). బీచ్లో కొత్త ఏడాది సంబరాలు చేసుకోవాలనుకునేవారికి గోకర్ణ మంచి ప్రదేశం. కేవలం గోకర్ణ బీచ్ మాత్రమే కాదు, దగ్గర్లోనే ఉండే కుడ్లే బీచ్, ఓమ్ బీచ్, పారడైజ్, హాఫ్ మూన్... అన్నీ ప్రదేశాలలో ఎంజాయ్ చేయచ్చు.
గోవా
కుర్రకారుకు సరైన డెస్టినేషన్ గోవా. మనదేశానికి పార్టీ హబ్ లాంటిది గోవా. ఎంజాయ్మెంట్ అంటే ఎవరికైనా గుర్తొచ్చేది గోవానే. గోవాలో దొరకనిదంటూ లేదు. కాకపోతే ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేందుకు అంత మంచి ఎంపిక కాదు.
Read Also: ఛీ... అద్దెకున్నవాళ్లు ఇలా కూడా చేస్తారా? పాపం ఆ ఓనర్
Read Also: ఇంజెక్షన్ అంటే భయమా? మీలాంటివాళ్ల కోసమే సూది లేని ఇంజెక్షన్లు వస్తున్నాయి...
Read Also: మనోళ్లు మాములుగా తినలేదుగా... నిమిషానికి ఎన్ని బిర్యానీలు కుమ్మేశారో తెలిస్తే షాకవుతారు
Read Also: లెక్కల వల్ల పిచ్చివాడు అవుతాడనుకున్నారు... కానీ ప్రపంచం మెచ్చిన గణిత శాస్త్రవేత్త ఎలా అయ్యారంటే..!