బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సెలక్షన్‌ కమిటీ తరఫున వకాల్తా పుచ్చుకొని మీడియాతో మాట్లాడటం సరికాదని మాజీ చీఫ్‌ సెలక్టర్‌ వెంగ్‌సర్కార్ అంటున్నాడు. కెప్టెన్సీ, ఆటగాళ్ల ఎంపిక, తొలగింపునకు సంబంధించిన అంశాలను సెలక్షన్ కమిటీయే చెప్పాలని పేర్కొన్నాడు. భారత క్రికెట్‌కు ఎంతో సేవ చేసిన విరాట్‌ కోహ్లీకి మెరుగైన వీడ్కోలు లభించాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఖలీజ్‌ టైమ్స్‌తో అతడు మాట్లాడాడు.


'సెలక్షన్‌ కమిటీ తరఫున మాట్లాడేందుకు గంగూలీకి ఎలాంటి అధికారం లేదు! అతడు బీసీసీఐ అధ్యక్షుడు. సెలక్షన్‌ లేదా కెప్టెన్సీని సంబంధించిన అంశాలపై మాట్లాడటం సెలక్షన్‌ కమిటీ పరిధిలోకి వస్తుంది' అని వెంగీ అన్నాడు. 


'మొత్తంగా ఏం జరిగిందో గంగూలీ చెప్పాడు. అలాగే తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలని విరాట్‌ అనుకున్నాడు. ఈ వ్యవహారం కెప్టెన్, సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్ మధ్యే ఉంటే బాగుండేది. ఏదేమైనా అది సౌరవ్‌ పధిలోని అంశం కాదు' అని వెంగ్‌సర్కార్‌ పేర్కొన్నాడు.


విరాట్‌ కోహ్లీకి మెరుగైన వీడ్కోలు లభిస్తే బాగుండేదని వెంగీ అన్నాడు. '1932 నుంచి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఒకసారైతే ఐదు టెస్టుల్లో నలుగురు కెప్టెన్లను మార్చడం చూశాం. నిజమే, ఇప్పుడు పరిస్థితులు మారాయి. కోహ్లీని అందరూ గౌరవించాల్సిందే. దేశం, భారత క్రికెట్‌ కోసం అతడెంతో కృషి చేశాడు. అతడితో వ్యవహరించిన తీరు మాత్రం కచ్చితంగా విరాట్‌ను బాధించే ఉంటుంది' అని దిలీప్‌ పేర్కొన్నాడు.


దక్షిణాఫ్రికా క్రికెట్‌ పర్యటనకు బయల్దేరే ముందు టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్‌ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. టీ20 కెప్టెన్సీ నుంచి దిగిపోయినప్పుడు తననెవరూ అడ్డుకోలేదని అతడు అన్నాడు. అయితే పొట్టి క్రికెట్‌ నాయకత్వం నుంచి తప్పుకోవద్దని అతడికి వ్యక్తిగతంగా సూచించానని గంగూలీ చెప్పడం గమనార్హం. వీరి మాటల్లో వైరుధ్యం వివాదానికి దారి తీసింది. దాంతో 'చెప్పేందుకేమీ లేదు. ఈ వ్యహారాన్ని బీసీసీఐ చూసుకుంటుంది. అంతా దానికి వదిలేయండి' అని దాదా స్పష్టం చేశాడు. గంగూలీ అభిప్రాయాలతో వెంగీ ఎప్పుడూ విభేదించే సంగతి తెలిసిందే.


Also Read: IND vs SA: తొలిటెస్టుకు టీమ్‌ఇండియా జట్టు ఇలాగే ఉండొచ్చు..! విశ్లేషకుల అంచనా ఇదే


Also Read: INDIA vs SOUTH AFRICA : కుర్రాళ్లను స్పెషల్‌ డిన్నర్‌కు తీసుకెళ్లిన ద్రవిడ్‌.. ఆటగాళ్లంతా హ్యాపీ హ్యాపీ


Also Read: India vs South Africa: హైదరాబాదీ సిరాజ్‌పై సచిన్‌ ప్రశంసలు.. ఎందుకంటే?


Also Read: IPL Auction 2022: ఐపీఎల్ వేలం తేదీలు వచ్చేశాయి..! ఫిబ్రవరిలోనే.. బెంగళూరులో


Also Read: Asian Champions Trophy Hockey 2021: పాకిస్థాన్ పై భారత్ గెలుపు.. ఖాతాలోకి కాంస్య పతాకం


Also Read: Virat Kohli Record: సఫారీ సిరీసులో కోహ్లీ బద్దలు కొట్టబోయే రికార్డులివే..! వందో టెస్టు..!