మేషం
ఈ రోజు మీకు మంచి రోజు. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు.  కష్టానికి తగిన ఫలితం పొందుతారు. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.
వృషభం
మీ రోజంతా మీకు శుభసమయమే. పెద్దల ఆశీస్సులు మీపై ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. తక్కువ మాట్లాడండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ప్రమాదం జరిగే సూచనలున్నాయి. 
మిథునం
మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. ఉద్యోగులు మంచి ఫలితాలు పొందుతారు, వ్యాపారులకు కలిసొస్తుంది, విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. చేపట్టిన పనిని చాకచక్యంగా పూర్తిచేస్తారు. ప్రణాళికలో అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. 


Also Read: ఈ రాశులవారు మహా తెలివైనోళ్లు.. వ్యూహాలు రచిస్తే తిరుగులేదు... 
కర్కాటకం
ఈ రోజంతా మీకు శుభఫలితాలే.  విద్యార్థులకు ఎంతో మంచి రోజు.. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబ అంతా సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు కలిసొచ్చే సమయం. ఉద్యోగులకు అనుకూల ఫలితాలే ఉన్నాయి.
సింహం 
ఈ శనివారం మీకు కలిసొస్తుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది, వ్యాపారులకు లాభాలొస్తాయి, విద్యార్థులు వారి సామర్థ్యం, ​​తెలివితేటల ఆధారంగా విజయాలు సాధిస్తారు. కుటుంబంతో మంచి వాతావరణం నెలకొంటుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. 
కన్య
అనుకో సామీ అయిపోద్ది అన్నట్టుంది ఈ రోజు. ఏ పని తలపెట్టినా ఇట్టే పూర్తిచేసేస్తారు. పైగా ఆ పనిద్వారా లాభం పొందుతారు.  ఈరోజంతా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేందుకు వీలు దొరుకుతుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. 


Also Read: ఈ రాశుల వారిని ప్రేమిస్తే నెత్తిన గుడ్డేసుకుని కూర్చోవడమే..
తుల
ఈ రాశివారిని ఏదో తెలియని ఆందోళన వెంటాడుతుంది. కుటుంబంతో కొంత సమయం గడిపేందుకు ప్రయత్నించండి ప్రశాంతతని పొందుతారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలొస్తాయి.
వృశ్చికం 
పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆర్థికంగా కలిసొచ్చే సమయం. ఉద్యోగులు, వ్యాపారులకు ఈ రోజంతా శుభసమయమే. అదృష్టం కలిసొస్తుంది. భవిష్యత్ కోసం కొన్ని ప్రణాళికలు వేసుకునేందుకు ఇదే మంచి సమయం. మీరు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మరింత కష్టపడతారు. 
ధనుస్సు
ఓ శుభవార్తతో మీ రోజు ప్రారంభమవుతుంది. ఉద్యోగులు మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారులు ఆర్థికంగా లాభపడతారు. డబ్బు బాగా ఆదాచేస్తారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 


Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
మకరం
మకరరాశి వారికి ఈ రోజు శుభసమయం. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారానికి సంబంధించి ప్రయాణం చేయాల్సి ఉండొచ్చు. ఉద్యోగులకు నిన్న మొన్నటి వరకూ ఫేస్ చేసిన ఇబ్బందులు తొలగుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. 
కుంభం
స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా వెళ్లాల్సి రావొచ్చు. ఓ ప్రత్యేకమైన వ్యక్తికోసం ప్రత్యేకమైన సమయం వెచ్చిస్తారు. ఉద్యోగులకు అనుకూల సమయం. వ్యాపారులు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా అడుగు వేయొచ్చు. మంచి వ్యక్తులను కలుస్తారు. 
మీనం
ఈ శనివారం మీకు కూడా కలిసొస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. జీవిత భాగస్వామి, పిల్లల నుంచి శుభవార్త వింటారు. చేసే పనిలో ఉత్సాహంగా దూసుకెళతారు. వ్యాపారులకు లాభాలొస్తాయి. 
Also Read:  2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..
Also Read: 2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 21 నుంచి 31వ తేదీల్లో పుట్టారా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి…
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి