ప్రేమ.. అనిర్వచనీయ అనుభూతి. ఎవరికి ఎవరిపై ఎప్పుడు ఎందుకు ప్రేమ పుడుతుందో చెప్పలేం. కొన్ని ప్రేమలు సఫలమవుతాయి, కొన్ని ప్రేమలు విఫలమవుతాయి. అయితే ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుందంటారు. కానీ కొన్ని రాశుల వారు మాత్రం ప్రేమించిన ప్రేమను ప్రేమించినా తమ ప్రేమ సంగతి మాత్రం బయట పెట్టరట . ఆరాశులేంటంటే..
Also Read: శీతాకాలం.. మంచు కురిసే సమయం.. ఈ రాశుల వారికి భలే ఇష్టమట!
మిథునం
మిథున రాశివారు అంత తేలిగ్గా ప్రేమను అంగీకరించరు, అంత త్వరగా బయటపడరట. ప్రేమ విషయంలోనే కాదు పెళ్లికి సంబంధించిన విషయాల్లోనూ కొన్ని ప్రయోగాలు చేశాకే భాగస్వామని ఎంపిక చేసుకుంటారు. వీరితో పరిచయం కావాలని అనుకున్నా కానీ కొన్ని షరతులు పెడతారట. ఫైనల్ గా ఈ రాశి వారు ఎవరినైనా ప్రేమించినా అంత తేలిగ్గా బయటపడరంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.
కన్య
ఈ రాశుల వారికి అన్నీ పరిపూర్ణంగా ఉండాలి. చివరకు ప్రేమ కూడా పరిపూర్ణత వచ్చే వరకూ ఏమీ బయటకు చెప్పరట. ఒకవేళ ఈ రాశివారు ప్రేమలో పడినా వీళ్లతో ఐ లవ్ యూ చెప్పించుకోవడం చాలాకష్టమట.
Also Read: ఈ రాశులవారు మహా తెలివైనోళ్లు.. వ్యూహాలు రచిస్తే తిరుగులేదు...
వృశ్చికం
ఈ రాశుల వారు సీతయ్య టైప్. ఎవ్వరి మాటా వినరు వాళ్ల సొంత ధోరణి వారిదే. మార్పును అంత తొందరగా అంగీకరించరు. ప్రేమ విషయాల్లో అయితే అస్సలు సహకరించరట. పొరపాటున వృశ్చిక రాశివారితో ప్రేమలో పడితే నెత్తిన గుడ్డేసుకుని కూర్చోవడమేనంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.
మకరం
ఈ వ్యక్తులు ఆచరణాత్మక వ్యక్తులు. వీరు చేసే వ్యాపారం అయినా వ్యవహారం అయినా తలపెట్టన ఏ పనైనా ఇతరులను సులభంగా ఆకర్షిస్తుంది. చేసే ప్రతి పనీ మనస్ఫూర్తిగా చేస్తారు.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
కుంభం
కుంభ రాశివారు ఫ్రీ బర్డ్ లా ఉండాలని కోరుకుంటారు. అందుకే వీళ్లు ఎవరినైనా ప్రేమిస్తారు కానీ పొరపాటున కూడా మాట బయటకు చెప్పరట. ఎందుకంటే ప్రేమ సంబంధాల్లో పడితే స్వేచ్ఛని కోల్పోతామనే భయంలో ఉంటారట.
Also Read: 2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..
Also Read: 2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 21 నుంచి 31వ తేదీల్లో పుట్టారా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి…
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి