నాలుగు నెలల చలికాలంలో కనీసం రెండు నెలలైనా చలి గట్టిగా కొడుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో నమోదై బెంబేలెత్తించేస్తుంటాయ్. ఈ సీజన్ అంటే చెడ్డ చిరాకు బాబూ అనేవారి సంఖ్య ఎక్కువే. అయితే  సీజన్స్ పై ఇష్టం-అయిష్టం అన్నది కూడా వారి వారి రాశులపై ఆధారపడి ఉంటుందట. వినడానికి ఆశ్చర్యంగా ఇది నిజమే అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఇంతకీ చలికాలాన్ని ఎంజాయ్ చేసే రాశులేంటంటే...


Also Read:  ఈ రాశులవారు మహా తెలివైనోళ్లు.. వ్యూహాలు రచిస్తే తిరుగులేదు...



వృషభం
ఈ రాశి వారికి చలికాలం అంటే చాలా ఇష్టమట. వృషభరాశివారు ఎప్పుడూ చల్లటి వాతావరణాన్ని కోరుకుంటారట. అన్ని సీజన్స్ కన్నా కూల్ వెదర్ సౌకర్యంగా ఉంటుందని భావిస్తారట. చల్లటి గాలులు వీస్తుంటే వెచ్చగా ముసుగేసుకుని కునుకేయడం భలే ఇష్టమట వీరికి. వాతావరణాన్ని బట్టి కూడా వీరి తీరు మారుతుందని ...చలికాలంలో కూల్ కూల్ గా కనిపిస్తారని కూడా చెబుతారు. 


Also Read:  2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..



కర్కాటకం
ఈ రాశి వారు శీతాకాలాన్ని బాగా ఆస్వాదిస్తారు. ఈ సీజన్లో ఇంట్లో ఉండి వేడివేడి వంటకాలు ఆస్వాదిస్తూ, హాట్ సూప్, టీ, కాఫీ తాగితే ఏముంటుందబ్బా అనుకుంటారట. ఓ వైపు వేడి వేడి ఫుడ్ ఎంజాయ్ చేస్తూ మరోవైపు టీవీల్లో కార్యక్రమాలు బాగా ఆస్వాదిస్తారట. కర్కాటక రాశివారు చలికాలంలో బయటకు వెళ్లడం కన్నా ప్రియమైన వారితో ఏకాంతంగా గడిపేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతారట.


Also Read: 2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..



కన్య
శీతాకాలాన్ని ఆస్వాదించే రాశుల్లో కన్య కూడా ఉంది. అయితే రొటీన్ కి భిన్నంగా చల్ల చల్లని గాలుల్లో భాగస్వామితో ఉండాలని కోరుకుంటే వీరు మాత్రం స్నేహితులతో ఎంజాయ్ చేయాలనుకుంటారట. ఈ సమయంలో వీరికి బయట తిరగడం ఏంటే మహాసరదా. చల్లటి గాలుల్లో గాల్లో తేలినట్టుందే అన్నట్టు ఫీలవుతారట. 


Also Read:  2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...



వృశ్చికం
ఈ రాశి వారు చలికాలంలో తమ పార్టనర్ తో కలసి పడకగదిలో ఎంజాయ్ చేయడాన్ని ఇష్టపడతారట. ఈ సీజన్లో ఎక్కువ మెమొరీస్ కూడబెట్టుకునే పనిలో ఉంటారట. కేవలం చలికాలంలోనే వ్యక్తిగత జీవితం ఆనందంగా ఉంటుందని భావిస్తారట.


Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..



మకరం
ఈ రాశి వారికి కూడా శీతాకాలం అంటే చాలా ఇష్టం.  వీరు అందరిలా కాకుండా లైఫ్ లో మరో అడుగు ముందుకేసే ఆలోచనలు ఎక్కువగా ఈ సీజన్లోనే చేస్తారట. భవిష్యత్ లో ఏం చేయాలనే ఆలోచనల్లో మునిగితేలుతారట. 


Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 21 నుంచి 31వ తేదీల్లో పుట్టారా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి…
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి