ఒకప్పుడు హీరోలు ఏడాదికి ఆరేడు సినిమాలు చేసేసేవాళ్లు. పది సినిమాలు చేసిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ ఇప్పటి హీరోలు ఏడాదికి ఒక్క సినిమా రిలీజ్ చేస్తే గగనం అన్నట్లుగా ఉంది పరిస్థితి. భారీ బడ్జెట్ సినిమాలు.. ఎక్కువ రోజులు షూట్ చేయాల్సి రావడం.. గ్రాఫిక్స్ వర్క్.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇలా ప్రతిదానికి ఎక్కువ సమయం పట్టేస్తుంది. పైగా కరోనా కారణంగా గత రెండేళ్లుగా సినిమా రిలీజ్ లు బాగా తగ్గాయి. అలా 2021లో కొంతమంది స్టార్ హీరోలు వెండితెరపై కనిపించలేదు. వారెవరో ఇప్పుడు చూద్దాం!
ప్రభాస్ : 2019లో 'సాహో' తరువాత ప్రభాస్ నుంచి కొత్త సినిమా రాలేదు. 'రాధేశ్యామ్' రిలీజ్ అవుతుందని అనుకున్నారు కానీ అది ఆలస్యమవుతూ వస్తోంది. ఫైనల్ గా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 'రాధేశ్యామ్' ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఎన్టీఆర్ : అప్పుడెప్పుడో 'అరవింద సమేత' సినిమాను రిలీజ్ చేశాడు ఎన్టీఆర్. ఆ సినిమా వచ్చి మూడేళ్లు దాటేసింది. ఇప్పటివరకు ఎన్టీఆర్ నుంచి మరో సినిమా రాలేదు. వచ్చే ఏడాది జనవరి 7న 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు.
రామ్ చరణ్ : బోయపాటి డైరెక్ట్ చేసిన 'వినయ విధేయ రామ' సినిమాతో చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రామ్ చరణ్. ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తరువాత నుంచి 'ఆర్ఆర్ఆర్' సెట్స్ పైకి వెళ్లిపోయాడు రామ్ చరణ్. ఫైనల్ గా ఆ సినిమా జనవరిలో విడుదల కానుంది. మధ్యలో 'ఆచార్య' సినిమాలో కూడా నటించాడు రామ్ చరణ్. అది కూడా వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మహేష్ బాబు : 2020లో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు ఆ తరువాత 2022 సంక్రాంతికి 'సర్కారు వారి పాట' రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు సమ్మర్ వరకు ఆగాల్సిన పరిస్థితి కలుగుతోంది.
విజయ్ దేవరకొండ: మన రౌడీ హీరో చివరిగా 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో కనిపించాడు. ఆ తరువాత 2021లో విజయ్ నటించిన ఒక్క సినిమా కూడా రాలేదు. 'జాతిరత్నాలు' సినిమాలో మాత్రం క్యామియో రోల్ చేశాడు. 2022లో విజయ్ నటిస్తోన్న 'లైగర్' సినిమా విడుదల కానుంది.
Also Read:కప్పు గెలుస్తాననే అనుకున్నా.. కానీ సిరితో సీన్ జరగడంతో.. షణ్ముఖ్ వ్యాఖ్యలు..
Also Read: పవన్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. సంక్రాంతి రేసు నుంచి 'భీమ్లానాయక్' ఔట్..
Also Read: సెక్సీగా కనిపించడం కోసం ఎంత కష్టపడ్డానో.. 'పుష్ప' ఐటెం సాంగ్ పై సామ్ రియాక్షన్..
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన రాధే శ్యామ్ టీమ్... రెబల్ స్టార్ లుక్ రిలీజ్!
Also Read: అప్పుడు అనుష్కతో... ఇప్పుడు సమంతతో
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి